Begin typing your search above and press return to search.

ఉత్తుత్తి కంపెనీల‌తో ఉత్తుత్తి ఒప్పందాలు.. మంత్రి మేక‌పాటిపై లోకేష్ విమ‌ర్శ‌లు

By:  Tupaki Desk   |   18 Feb 2022 9:30 AM GMT
ఉత్తుత్తి కంపెనీల‌తో ఉత్తుత్తి ఒప్పందాలు.. మంత్రి మేక‌పాటిపై లోకేష్ విమ‌ర్శ‌లు
X
ఏపీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి మేకపాటి గౌతం రెడ్డిపై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. దుబాయ్ ఎక్స్‌పోలో షెల్‌ కంపెనీలతో మంత్రి డొల్ల ఒప్పందాలు కుదుర్చుకుని.. ఎవరికీ తెలియదని అనుకుంటున్నారని విమర్శించారు.

ఉత్తుత్తి కంపెనీతో జరిగిన ఉత్తుత్తి ఒప్పందాన్ని టీడీపీ బయటపెట్టిందని ట్వీట్‌ చేశారు. కళ్లు మూసుకుని పాలు తాగుతూ... తనను ఎవరూ చూడలేదని పిల్లి అనుకున్నట్టుగా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి వ్యవహారం ఉందని లోకేశ్‌ ఎద్దేవా చేశారు. దుబాయ్ ఎక్స్‌పోలో షెల్‌ కంపెనీలతో డొల్ల ఒప్పందాలు కుదుర్చుకుని.. ఎవరికీ తెలియదని అనుకుంటున్నారని విమర్శించారు.

రూ.3 లక్షలు కూడా లేని కంపెనీ రూ.3 వేల కోట్ల పెట్టుబడి పెడుతామన్న లోగుట్టుని..ఉత్తుత్తి కంపెనీతో జరిగిన ఉత్తుత్తి ఒప్పందాన్ని టీడీపీ బయటపెట్టిందని ట్వీట్‌ చేశారు. దీనిపై మంత్రి, ప్రభుత్వ పెద్దలు తేలుకుట్టిన దొంగల్లా స్పందించడం లేదని లోకేశ్‌ విమర్శించారు.

అయితే.. ఇటీవ‌ల కూడా లోకేష్‌.. మంత్రి మేక‌పాటి దుబాయ్ ప‌ర్య‌ట‌న‌పై లోకేష్ విరుచుకుప‌డ్డారు. ఖాళీ కుర్చీలకి ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వడానికి గౌతమ్ రెడ్డి అబుదాబి వరకూ వెళ్లాలా? అంటూ సెటైర్లు విసిరారు. జగన్ గురించి పెద్దగా అబుదాబీలో ఎవరికీ తెలియదని మంత్రి సెలవివ్వడం స్పీచ్ కే హైలెట్ అని ఎద్దేవా చేశారు.

కొత్త కంపెనీలు తెచ్చి ఉపాధి కల్పించడం ఎలాగో వైసీపీ ప్రభుత్వానికి చేతకాదన్నారు. ప్రస్తుతమున్న కంపెనీలైనా తరలిపోకుండా చూస్తే అదే పదివేలు అంటూ హితవు పలికారు.

మంత్రి గౌతమ్ రెడ్డి అబుదాబి పర్యటనపై విమర్శనాస్త్రాలు సంధించారు. చెత్త పాలన, బెదిరింపుల దెబ్బకి కంపెనీలు ఇతర రాష్ట్రాలకు పారిపోతున్నాయని, అంతర్జాతీయ స్థాయిలో ఏపీ పరువు గంగలో కలిసిపోయిందని లోకేశ్ దుయ్యబట్టారు. కొత్త కంపెనీలు తెచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం వైసీపీకి ఎలాగూ చేతకాదన్నారు. కనీసం ఉన్న కంపెనీలు పోకుండా చూస్తే అదే పదివేలని హితవుపలికారు. అబుదాబి సమావేశానికి సంబంధించిన వీడియోలను లోకేశ్‌ విడుదల చేశారు.