Begin typing your search above and press return to search.

కేసీఆర్ పై ప్రేమను చాటుకున్న నరసింహన్..

By:  Tupaki Desk   |   21 Oct 2020 6:00 PM GMT
కేసీఆర్ పై ప్రేమను చాటుకున్న నరసింహన్..
X
ఒకప్పుడు వారిద్దరూ బద్ద శత్రువులుగా భావించుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నాడు ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ గా నరసింహన్ అణిచివేస్తున్నారని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్, ఈటెల, కేటీఆర్,లు అసెంబ్లీలో పెద్ద రచ్చ చేశారు. కేసీఆర్ సైతం అప్పటి గవర్నర్ నరసింహన్ పై తీవ్ర విమర్శలు చేశారు. కానీ తెలంగాణ వచ్చాక సీన్ మారింది.

తెలంగాణ, ఏపీ గవర్నర్ గా నరసింహన్ ఉన్నారు. ఆ తర్వాత తెలంగాణకు గవర్నర్ అయ్యారు. ఆ టైంలో కేసీఆర్ పాలనకు విశేషంగా మద్దతిచ్చారు. కేసీఆర్ అడుగులో అడుగేశారు. ఒక పెద్దన్నలా కేసీఆర్ ను గైడ్ చేశారు. నరసింహన్ అడగడమే ఆలస్యం కేసీఆర్ ఆ కోరికలు తీర్చేవారు. అలాంటి స్నేహ బంధానికి నరసింహన్ రిటైర్ మెంట్ తో వీడ్కోలు పడింది. గవర్నర్ గా నరసింహన్ ను బీజేపీ ప్రభుత్వం తొలగించడంతో ఆయన వీడ్కోలును కేసీఆర్ ఘనంగా నిర్వహించారు. అప్పుడు కన్నీళ్ల పర్యంతం అయ్యారు కూడా.

అలాంటి కేసీఆర్-నరసింహన్ బంధం మరోసారి బయటపడింది. ప్రస్తుతం గవర్నర్ గా రిటైర్ అయ్యి తమిళనాడు రాజధాని చెన్నైలో నరసింహన్ తన కుటుంబంతో ఉంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలోని హైదరాబాద్ లో వరదలు రావడం.. విరాళాలతో ఆదుకోవాలన్న కేసీఆర్ పిలుపునకు నరసింహన్ స్పందించడం గమనార్హం.

నరసింహన్ తాను దాచుకున్న వ్యక్తిగత సేవింగ్స్ నుంచి రూ.25వేలను సీఎంఆర్ఎఫ్ కు విరాళంగా ఇచ్చారు. నరసింహన్ ఇవ్వడమే కాదు.. బాధిత ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సహాయ పునరావాస కార్యక్రమాలను అభినందిస్తూ చాలా రోజుల తర్వాత ఒక ప్రకటనను నరసింహన్ విడుదల చేశారు.

నరసింహన్ ప్రకటన చూసి కేసీఆర్ ఫిదా అయ్యారు. రూ.25వేలే ఇచ్చినా కూడా నరసింహన్ స్పందనకు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇలా నరసింహన్-కేసీఆర్ బంధం మరోసారి బయటపడినట్టైంది.