Begin typing your search above and press return to search.
నరసింహన్ నోట!... నారసింహుడి మాట!
By: Tupaki Desk | 18 Feb 2018 9:59 AM GMTతెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎసల్ నరసింహన్... చాలా గంభీరంగానే కనిపిస్తారు. పూర్వాశ్రమంలో ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘ కాలం పనిచేసిన నరసింహన్ చూడ్డాటానికి గంభీరంగానే కనిపిస్తారు. ఏ విషయంపై అయినా తనకు నచ్చినట్లుగానే వ్యవహరించే నరసింహన్... తనకు నచ్చలేదంటే మాత్రం ఎవరు చెప్పినా పట్టించుకోరన్న వాదన లేకపోలేదు. యూపీఏ సర్కారు హయాంలో ఉమ్మడి ఏపీకి గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన నరసింహన్... తెలుగు నేల రెండుగా విడిపోయిన తర్వాత - కేంద్రంలో యూపీఏ సర్కారు స్థానంలో ఎన్డీఏ సర్కారు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా కంటిన్యూయస్ గా కొనసాగుతూనే ఉన్నారు. ఐపీఎస్ అధికారిగా తన కెరీర్ లో వివాద రహితుడిగానే కాకుండా అధికారంలో ఉన్న ప్రభుత్వాల ఇష్టాఇష్టాలను ఇట్టే పట్టేసే తత్వమున్న నరసింహన్ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ గా తన కుర్చీని బాగానే కాపాడుకుంటున్నారు. ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయితే.. రాష్ట్ర విభజన సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఇట్టే పరిస్థితిని చక్కదిద్దగలరన్న భావనతో యూపీఏ సర్కారు నరసింహన్ కు గవర్నర్ గిరీని కట్టబెట్టిందన్న వాదన నాడు వినిపించింది.
నాటి యూపీఏ సర్కారు అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పనిచేసిన నరసింహన్... యూపీఏ సర్కారు మదిని దోచేసుకున్నారు. అయితే గడచిన సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ గద్దె దిగడం - నరేంద్ర మోదీ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో బీజేపీ నేపథ్యం లేని గవర్నర్లకు ఇక కాలం చెల్లిపోయినట్టేనన్న భావన వ్యక్తమైంది. ఈ భావన నిజమేనన్నట్లుగా చాలా రాష్ట్రాల గవర్నర్లను మార్చేసిన మోదీ సర్కారు... తన పార్టీతో అనుబంధం ఉన్న వారిని ఆయా స్థానాల్లో నియమించింది. అయితే నరసింహన్ విషయానికి వచ్చేసరికి మాత్రం... మోదీ సర్కారు తన భావనను మార్చేసుకుందనే చెప్పాలి. నరసింహన్ వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనమని చెప్పక తప్పదు. కేంద్రంలో సర్కారు మారినా... తన పదవిని కాపాడుకున్న నరసింహన్ కు ఇప్పుడప్పుడే పదవీ గండం ఉందన్న మాట కూడా ఎక్కడా వినిపించడం లేదు. అయినా ఇప్పుడు నరసింహన్ గురించి ఇంతగా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందన్న విషయానికి వస్తే... తమిళ తంబీ అయిన నరసింహన్ నిన్న తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డుల ప్రదానోత్సవానికి సతీసమేతంగా హాజరైన నరసింహన్... కార్యక్రమంలో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దాదాపుగా ఎప్పుడు చూసినా గంభీరంగా కనిపించే నరసింహన్... నిన్నటి కార్యక్రమంలో మాత్రం కాస్తంత ఉల్లాసంగానే కాకుండా ఉత్సాహంగా కూడా కనిపించారు. గంభీర వదనాన్ని పక్కనపెట్టేసిన నరసింహన్... అక్కడి వారితో చాలా ఉల్లాసంగా గడిపారు. నరసింహన్ లో ఈ మార్పును గమనించిన కార్యక్రమ నిర్వాహకుడు *నరసింహన్ ఎప్పుడూ గంభీరంగానే ఉంటారని అనుకున్నాం. కానీ ఆయన చాలా సరదాగా ఉన్నారు* అని వ్యాఖ్యానించారట. అప్పటికే తన ప్రసంగాన్ని పూర్తి చేసిన నరసింహన్... ఈ మాట వినపడగానే... మరోమారు మైందుకుని చేసిన వ్యాఖ్యలు అక్కడి వారిని షాక్ కు గురి చేశాయని చెప్పాలి. అయినా నరసింహన్ ఏమన్నారంటే... *నేను నరుడినే. అయితే నాలో నారసింహుడు కూడా ఉన్నాడు. ఆ నారసింహుడిని బయటకు చూపడం లేదంతే*అని నరసింహన్ వ్యాఖ్యానించారు. మొత్తానికి ఐపీఎస్ ఆఫీసర్ గా తాను పనిచేసిన దినాలను గుర్తు చేస్తూనే నరసింహన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి. మొత్తానికి తన పేరులోని నరసింహుడిని ఈఎస్ఎల్ ఈ విధంగా చెప్పుకొచ్చారన్న మాట.