Begin typing your search above and press return to search.
కశ్మీర్ గవర్నర్ గా నరసింహన్?... కేంద్రం లెక్క ఇదేనా?
By: Tupaki Desk | 5 Aug 2019 12:19 PM GMTజమ్మూ కశ్మీర్ పై గడచిన నాలుగు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలు... సోమవారం నాటితో ఓ కొలిక్కి వచ్చాయనే చెప్పాలి. జమ్మూ కశ్మీర్ కు రాజ్యాంగం కల్పించిన స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తూ నరేంద్ర మోదీ సర్కారు తీసుకున్న డేరింగ్ డెసిషన్ పై మెజారిటీ పార్టీలు మద్దతు పలికినా... కశ్మీర్ లోని ఏ ఒక్క పార్టీ కూడా మద్దతు పలకలేదు. ఈ క్రమంలో అక్కడ శాంతిభద్రతలు కట్టు తప్పే ప్రమాదం లేకపోలేదన్న వార్తలు గడచిన మూడు రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. అయినా కూడా ఓ వైపు ఆ రాష్ట్రంలో శాంతిభద్రతలు కట్టు తప్పితే ఎలా వ్యవహరించాలి? అన్న విషయంపై ఆలోచన చేస్తూనే... మరోవైపు తాను అనుకున్న పనిని మోదీ సర్కారు నిర్విఘ్నంగానే ముగించింది. ఈ క్రమంలో కశ్మీర్ లో పరిస్థితి కట్టు తప్పకుండా ఉండాలంటే... అనుభవం ఉన్న గవర్నర్ అవసరం ఎంతైనా ఉందన్న వాదన వినిపిస్తోంది. ఈ వాదనతోనే తెలంగాణ గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ ను కశ్మీర్ గవర్నర్ గా మార్చేస్తారంటూ వార్తలూ వినిపిస్తున్నాయి.
నరసింహన్ కశ్మీర్ గవర్నర్ గా బదిలీ కావడం దాదాపుగా అయిపోయిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయినా కశ్మీర్ పై సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం... నరసింహన్ నే అక్కడికి గవర్నర్ గా ఎందుకు పంపాలని నిర్ణయం తీసుకుందన్న విషయంపై చాలా లెక్కలే వినిపిస్తున్నాయి. తెలుగు నేల విభజన జరిగిన సమయంలో విభజనకు కాస్తంత ముందుగానే హైదరాబాద్ లో కాలుపెట్టిన నరసింహన్ రాష్ట్రంలో శాంతిభద్రతలు కట్టు తప్పకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. అంతేనా... తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా రెండు రాష్ట్రాలకు ఐదేళ్లపై పైగా ఉమ్మడి గవర్నర్ గా వ్యవహరించిన నరసింహన్... తన సత్తా ఏమిటో నిరూపించుకున్నారు. అంతకంటే కూడా మాజీ ఐపీఎస్ అధికారిగా ఆయన కేంద్రంలో పలు కీలక పదవుల్లో రాణించిన వైనం కూడా ఆయనకు ప్లస్ గా మారే ఛాన్ష్ ఉంది.
అంతేకాకుండా ప్రస్తుతం మోదీ సర్కారులో జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న అజిత్ దోవల్ కు నరసింహన్ అత్యంత సన్నిహితుడన్న విషయం కూడా ఇక్కడ కీలకమేనట. దోవల్ మాట ఏ స్థాయిలో చెల్లుబాటు అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. అలాంటప్పుడు ఆయనకు సన్నిహితుడిగా, తెలుగు నేల విభజన సమయంలో సమర్ధవంతంగా వ్యవహరించారని పేరు తెచ్చుకున్న నరసింహన్ ను... ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉన్న కశ్మీర్ కు గవర్నర్ గా ఎంపిక చేయడంలో కేంద్రం తనదైన లెక్కలు వేసుకుంటుంది కదా. ఆ దిశగానే నరసింహన్ ఇప్పుుడ కశ్మీర్ గవర్నర్ గా వెళతారన్న వార్తలకు బలం చేకూరుతోంది. చూద్దాం... మరి ఏం జరుగుతుందో?