Begin typing your search above and press return to search.
రతన్ టాటా కాళ్లు మొక్కిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ...కారణం ఏంటంటే ?
By: Tupaki Desk | 29 Jan 2020 11:18 AM GMTప్రపంచంలోనే సాఫ్ట్ వేర్ రంగంలో టాప్ లో కొనసాగుతున్న ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ స్వామి పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ట్విటర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ఇలా అన్ని చోట్లా ఈయన పై నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దానికి ప్రధాన కారణం ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా కాళ్లు మొక్కడమే. ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణస్వామి టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా కు పాదాభివందనం చేశారు.
పూర్తి వివరాలు చూస్తే ... మంగళవారం ముంబైలో జరిగిన TiEconMumbai కార్యక్రమంలో రతన్ టాటా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణస్వామి చేతుల మీదుగా రతన్ టాటా అవార్డు అందుకున్నారు. అదే సమయంలో తన కంటే వయసులో పెద్దవారైన రతన్ టాటాకి అవార్డు ప్రధానం చేసిన తరువాత, నారాయణ మూర్తి రతన్ టాటాకి పాదాభివందనం చేశారు.
ఆ ఫొటోలను రతన్ టాటా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేశారు. నారాయణ మూర్తి వంటి మంచి స్నేహితుడి చేతులు మీదుగా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది అని తన ఇన్ స్టాగ్రామ్ లో తెలిపారు. దీనితో ప్రస్తుతం అయన పోస్ట్ చేసిన ఆ ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. రతన్ టాటాకు పాదాభివందనం చేసి నారాయణమూర్తి తన విధేయతను చాటుకున్నారని , అలాగే ఎంతఎదిగినా కూడా ఒదిగి ఉండటం ఎలాగో చుపించారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.