Begin typing your search above and press return to search.

నారాయ‌ణ‌.. నారాయ‌ణ‌.. ఎవ‌రిది బానిస బ‌తుకు కామ్రేడ్ ..!

By:  Tupaki Desk   |   7 April 2022 6:39 AM GMT
నారాయ‌ణ‌.. నారాయ‌ణ‌.. ఎవ‌రిది బానిస బ‌తుకు కామ్రేడ్ ..!
X
"2019 సాధారణ ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన జగన్‌ బానిసలా బతుకుతున్నారు. కేంద్రంలోని బీజేపీ కను సన్నల్లో జగన్‌ పాలన సాగుతోంది. కేంద్ర విధానాలకు అనుగుణంగా ప్రజలపై భారాలు మోపుతు న్నారు" అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ చేసిన‌ తీవ్రమైన వ్యాఖ్యలు నెట్టింట మంట‌లు రేపుతున్నాయి. "నారాయ‌ణ‌గారూ.. మీరా... బానిస బ‌తుకుల గురించి మాట్లాడేది?" అని ప‌లువులు ఘాటుగానే స్పందిస్తు న్నారు. ఉద్య‌మాలే ఊపిరిగా.. ప్ర‌జ‌ల క‌ష్ట న‌ష్టాలే.. ఉఛ్వాస నిశ్వాసాలుగా.. ఆవిర్భ‌వించిన క‌మ్యూనిస్టుల త‌ర్వ‌త త‌రం చేసిన ఘ‌న కార్యాల కార‌ణంగా.. మారిన ప‌రిస్థితుల‌ క‌న్నా.. ఈ దేశంలో బానిస నాయ‌కులు ఇంకెవరైనా ఉన్నారా? అని నిల‌దీస్తున్నారు.

"2014-19 వ‌ర‌కు.. ఏపీలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి అంటకాగిన పార్టీ.. సీపీఐ కాదా? నాడు ప‌శ్చిమ గోదా వ‌రి జిల్లాలోని తుందుర్రులో స‌ముద్ర ఉత్ప‌త్తుల ప్రాస‌సింగ్‌ ఫ్యాక్ట‌రీ(ఆక్వా)కి అనుమ‌తులు ఇవ్వ‌డంపై చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తామ‌ని... ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టి.. పోలీసుల‌తో వారు త‌న్నులు తినేలా చేసి.. త‌ర్వాత‌.. చంద్ర‌బాబు విసిరిన పార్టీ కార్యాల‌యాల‌ భూముల బిస్క‌ట్‌ల‌కు బానిస అయిం ది.. ఏ పార్టీ?! ఆ రుణాన్ని ఇప్ప‌టికీ తీర్చుకుంటూనే ఉన్నారు క‌దా!"అని నెటిజ‌న్లు తీవ్ర‌స్థాయిలో ప్ర‌శ్నిస్తున్నారు.

2019 ఎన్నిక‌ల‌కు ముందు.. వైసీపీని అధికారంలోకి రాకుండా చేసేందుకు చంద్ర‌బాబు ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్లు చీల్చేందుకు.. ప్ర‌య‌త్నించిన మ‌రో పార్టీతో చేతులు క‌లిపి.. ఆ పార్టీ అధినేత ఇంటి ప్ర‌హ‌రీగోడ‌లు దూకి.. మ‌రీ.. పొత్తుకు ప్ర‌య‌త్నించిన పార్టీ ఎవ‌రిదో.. అలా ఎందుకు చేయాల్సి వ‌చ్చిందో.. దానిని ఏమం టారో.. చెప్పాలి నారాయ‌ణ గారూ! అని మ‌రికొంద‌రు ప్ర‌శ్నించారు.

ఇక‌, కేంద్రంలో ధ‌ర‌ల పెరుగుద‌ల విష‌యంపై నిల‌దీస్తామ‌ని.. గొంతు చించుకుని మైకుల ముందు అరిచే కామ్రెడ్లు.. వ్యూహాత్మ‌క మౌనం పాటించి.. రాజ్య‌స‌భ‌ల నుంచి వాకౌట్ చేసిన సంద‌ర్భాలు.. ఏ బానిస‌త్వం ఖాతాలో వేసుకోవాలో చెప్పాల‌ని నిల‌దీస్తున్నారు.

పార్టీ కార్యాల‌యానికి భారీ విరాళం ఇచ్చిన కార్పొరేట్ కంపెనీ.. అక్ర‌మాల‌ను ప్ర‌శ్నించ‌డం మానేశార‌నే నింద‌.. ఇప్ప‌టికీ నెల్లూరు న‌డిబొడ్డున హ‌ల్చ‌ల్ చేస్తోంద‌ని.. మ‌రికొంద‌రు నెటిజ‌న్లు వ్యాఖ్యానించారు. మీకు మేం.. మాకు మీరు.. అనే ఫార్ములాతో రాజ‌కీయాలు చేస్తున్న కామ్రేడ్లు.. చేస్తున్నది ఏమిటో అదే నోటితో.. శ్రీమాన్ నారాయ‌ణ స్వామి.. చెప్పి ఉంటే.. మాట‌ల‌కు, చేత‌ల‌కు మ‌ధ్య పొందిక ఉంద‌ని.. ప్ర‌జ‌లు న‌మ్ముతారు. కానీ.. త‌మ పార్టీ అస్తిత్వాన్ని పొరుగు పార్టీల ప్ర‌యోజ‌నాల కోసం.. తాక‌ట్టు పెడుతూ.. క‌మ్యూనిస్టులను కాసులిస్టులుగా మార్చే నాయ‌కులు.. ఎవ‌రిని ఎవ‌రికి బానిస‌ల‌ని వ్యాఖ్యానిస్తున్నారు? అని నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు.

కీల‌కమైన‌.. పెట్రోలు, డీజిల్ ధ‌ర‌ల‌ను జీఎస్టీలో చేర్చేందుకు ఉద్దేశించిన పార్ల‌మెంట‌రీ ప్యాన‌ల్ క‌మిటీలో రాజ్య‌స‌భ నుంచి సీపీఐ రాజాకు అవ‌కాశం వ‌స్తే.. ఎందుకు త‌ప్పుకొన్న‌ట్టు? దీని వెనుక ..ఎవ‌రు ఉన్నారు? దీనిని ఏమంటారు? దీనిని దేనితో పోలుస్తారు? విశాల ప్ర‌జాహిత‌మే ప‌ర‌మావ‌ధిగా చెప్పుకొనే.. కామ్రేడ్లు.. విశాల స్వ‌ప్ర‌యోజ‌న హితం కోసం. పాకులాడుతుండ‌బ‌ట్టే.. నానాటికీ తీసిక‌ట్టుగా ఎర్ర జెండా వెల వెల‌బోతోంది.. వెలిసిపోతోంది! అని ఎక్కువ మంది అభిప్రాయ‌డుతున్నారు. మ‌రి దీనిపై కామ్రేడ్ నారాయ‌ణ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.