Begin typing your search above and press return to search.

నారాయణ వైసీపీకి చాలెంజ్ చేస్తున్నాడా?

By:  Tupaki Desk   |   15 Jun 2020 10:10 AM GMT
నారాయణ వైసీపీకి చాలెంజ్ చేస్తున్నాడా?
X
అధికారం కోసం కొందరు.. ఆస్తులు కాపాడుకోవడానికి మరికొందరు.. టీడీపీ పని అయిపోయిందని ఇంకొందరు.. ఇలా వైసీపీ బాట పట్టేస్తున్నారు. బెల్లం చుట్టూ ఈగల వలే అధికారంలో ఉంటే కానిచ్చేయచ్చు కాబట్టి వైసీపీలోకి టీడీపీ నేతల వలసలు కొనసాగుతున్నాయి.

అయితే వైసీపీలోకి అందరినీ తీసుకోవడం లేదు ఆపార్టీ అధినేత, సీఎం జగన్.. టీడీపీలో ఉండగా.. తన పార్టీని టార్గెట్ చేసిన వారిని అస్సలు దగ్గరకు రానీయడం లేదు. అవినీతి ఆరోపణలుంటే నో చెబుతున్నారు. మధ్యస్తంగా ఉన్నవారు.. వైసీపీకి లాభం కలిగే వారినే చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీలో జగన్ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం పెట్టడం.. ఏపీ కార్పొరేట్ విద్యా వ్యాపారంలో ఉన్న నారాయణ విద్యాసంస్థలకు చిక్కులు రావడంతో ఆయన కూడా వైసీపీలోకి చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

మాజీ మంత్రిగా, టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడైన నారాయణ పార్టీ మారడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీని వీడడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే నెల్లూరు సిటీ నియోజకవర్గానికి చంద్రబాబు తాజాగా నారాయణ స్తానంలో కొత్త ఇన్ చార్జిని కూడా నియమించేశారు.

నారాయణ ప్రస్తుతం అధికార వైసీపీ వైపు చూస్తున్నారు.చేరడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ అమరావతి నిర్మాణం, భూముల్లో కీలక పాత్ర పోషించిన నారాయణ చేరికకు జగన్ తటపటాయిస్తున్నారట.. భారీ అవినీతి ఆరోపణలు కూడా రావడంతో నారాయణ విషయంలో జగన్ జాప్యం చేస్తున్నారని వైసీపీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అయితే నారాయణ రాకను వైసీపీలోని చాలా మంది వ్యతిరేకిస్తున్న వార్తలు వస్తున్నాయి. అవినీతి ఆరోపణలు ఉండడం వల్ల వైసీపీలోకి వద్దంటున్నారు. అరెస్ట్ భయంతోనే నారాయణ వస్తున్నారని వైసీపీ సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు.

వైసీపీ నుంచి గ్రీన్ సిగ్నల్స్ రాకపోవడంతో నారాయణ ప్లాన్ బి అమలు చేస్తున్నారట.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరుతానంటూ ప్రచారం చేస్తున్నారట.. బీజేపీలో చేరుతారంటే వైసీపీ వాళ్లే పిలుస్తారని నారాయణ ఈ ప్లాన్ చేసినట్టు అర్థమవుతోందంటున్నారు. బీజేపీలోకి వెళ్లే మెరుగైన నేతను వైసీపీలోకి తీసుకురావడానికి ఇప్పటికే మేకపాటి కుటుంబం వైఎస్ జగన్ ను ఒప్పించే ప్రయత్నాలు చేస్తోందట.. బీజేపీ కంటే వైసీపీనే బెటర్ అని వారు వాదిస్తున్నారట..

ఇలా నారాయణ బీజేపీని బూచీగా చూపి వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది. మరి జగన్ రానిస్తారా? వదులుకుంటారా అన్నది సస్పెన్స్ గా మారింది.