Begin typing your search above and press return to search.
'నారాయణ' లో ఐటీ సోదాలు జరగలేదట!
By: Tupaki Desk | 5 Oct 2018 8:18 AM GMTతెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి ప్రభావం ఏపీ రాజకీయాలపై పడినట్లు కనిపిస్తోంది. తెలంగాణలో రేవంత్ పై ఈడీ దాడులు....ఏపీలో టీడీపీ నేతలపై ప్రభావం చూపిస్తున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా, ఏపీలో కొన్ని సంస్థలపై జరుగుతోన్న ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి - నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ ఆస్తులపై ఐటీ అధికారులు దాడులు చేసినట్లు వదంతులు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. సదరన్ డెవలపర్స్ ఆఫీసులో జరిపిన సోదాల్లో కొన్ని కీలకమైన డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. దాంతోపాటు, నేడు ఉదయం విజయవాడ నారాయణ కళాశాలను కూడా ఐటీ అధికారులు సందర్శించి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమ సంస్థలపై వస్తోన్న పుకార్లను నారాయణ ఖండించారు. తమ కళాశాలలపై ఎటువంటి ఐటీ దాడులు జరగలేదని, అవన్నీ వదంతులేనని కొట్టిపారేశారు.
కాగా, విజయవాడ నగరంలో మొత్తం మూడు చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్ కు చెందిన సదరన్ డెవలపర్స్ అండ్ కన్‌స్ట్రక్షన్స్ - డీఎస్ లాజిస్టిక్స్ సంస్థ ప్రతినిధుల నివాసాలు - కార్యాలయాలపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటలోని ప్రీ కాస్టింగ్ - ఇటుకల తయారీ కంపెనీపై సోదాలు చేపట్టారు. 7 బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు గుంటూరు - విజయవాడ - కృష్ణా జిల్లాలో సోదాలు నిర్వహిస్తున్నారు. రాజకీయ నేతలను టార్గెట్ చేస్తూ ఐటీ దాడులు జరగవచ్చంటూ ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కానీ, ఐటీ శాఖ అధికారులు ఆ వదంతులను కొట్టిపారేశారు. కానీ, నెల్లూరులో టీడీపీ నాయకుడు బీద మస్తాన్ రావు కార్యాలయాల్లో ఐటీ అధికారులు గురువారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. కానీ, మీడియాతో మాట్లాడేందుకు వారు ఇష్టపడలేదు. మరోవైపు, ఐటీ శాఖ దాడులపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు.