Begin typing your search above and press return to search.
పుదుచ్చేరి మాజీ సీఎంకి కాంగ్రెస్ షాక్ .. ఏంచేసిందంటే ?
By: Tupaki Desk | 17 March 2021 5:30 AM GMTదేశంలో ఎన్నికల కోలాహాలం కొనసాగుతుంది. పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి వి నారాయణస్వామి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయరు అని పుదుచ్చేరి ఇన్ ఛార్జి ఎఐసిసి కార్యదర్శి దినేష్ గుండు రావు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వి నారాయణస్వామి పుదుచ్చేరి లో జరిగే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయరు. ఆయన ప్రచారం మరియు ఎన్నికల నిర్వహణ చేసుకుంటారు అని రావు పేర్కొన్నారు. ఇక పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ 14 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అందులో మాజీ సీఎం పేరు లేకపోవడం తో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే , ఆ తర్వాత అసలు విషయాన్ని తెలియజేసారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి వి నారాయణస్వామి పోటీలో లేరు.
ముఖ్య అభ్యర్థులలో పి.శెల్వనాదనే కార్దిర్గామం అసెంబ్లీ సీటు నుంచి, ఇందిరా నగర్ నుంచి ఎం కన్నన్, ఒసుడు నుంచి కార్తికేయన్, మాహే నుంచి రమేష్ ప్రీమ్ బాత్ పోటీపడనున్నారు. ఇక పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ఏప్రిల్ 6 న జరుగుతుంది. ఐదుగురు కాంగ్రెస్, ఒక ద్రావిడ మున్నేట్ర కజగం (డీఎంకే) శాసనసభ్యులు రాజీనామా చేసిన నేపథ్యంలో 33 మంది సభ్యుల సభలో ఫ్లోర్ టెస్ట్ ఓడిపోవడంతో ఫిబ్రవరి 22న నారాయణసామి రాజీనామా చేశారు. ఫిబ్రవరి 23న అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ నారాయణసామి రాజీనామాను, ఆయన మంత్రుల మండలిని అంగీకరించారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 15 సీట్లు, అఖిల భారత ఎన్ ఆర్ కాంగ్రెస్ ఎనిమిది సీట్లు, ఎఐఎడిఎంకెకు నాలుగు సీట్లు, డీఎంకే రెండు ఎమ్మెల్యే సీట్లు గెలిచింది. బీజేపీ ఒక్క సీట్ కూడా గెలవలేకపోయింది.