Begin typing your search above and press return to search.

చంద్రబాబు మద్యం స్మగ్లింగ్ చేస్తున్నారా ?

By:  Tupaki Desk   |   19 Nov 2020 5:46 PM GMT
చంద్రబాబు మద్యం స్మగ్లింగ్ చేస్తున్నారా ?
X
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు మద్యం స్మగ్లింగ్ చేస్తున్నారా ? స్మగ్లింగ్ లో వచ్చే ఆదాయంలో చంద్రబాబే 80 శాతం తీసుకుంటున్నారా ? అంటే అవుననే అంటున్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి. పొరుగు రాష్ట్రాల నుండి ఏపిలోకి వస్తున్న అక్రమ మద్యం వ్యాపారంలో 80 శాతం చంద్రబాబు హస్తముందంటు ఉపముఖ్యమంత్రి చేసిన ఆరోపణలు సంచలనంగా మారింది. అలా వస్తున్న మద్యం వ్యాపారం ఆదాయంలో 80 శాతం చంద్రబాబే తీసుకుంటున్నారంటు నారాయణస్వామి చెప్పారు.

ఇటువంటి కారణాల వల్లే మద్యం స్మగ్లింగ్ లో పట్టుబడిన వాహనాల్లో డ్రైవర్లు, క్లీనర్లపైనే కాకుండా వాహన యజమానులపైన కూడా కేసులు పెట్టాలని తమ ప్రభుత్వం లేటెస్టుగా డిసైడ్ చేసిందన్నారు. మద్యం అక్రమ వ్యాపారం వెనుక ఎంతటి నేతలున్నా వదిలిపెట్టేది లేదనే పరమ రొటీన్ డైలాగ్ చెప్పేశారు ఉపముఖ్యమంత్రి. మద్యం నిషేధం కావాలా వద్దా అన్న విషయాన్ని చంద్రబాబు క్లారిటి ఇవ్వాలంటు డిమాండ్ చేశారు.

మద్యం దుకాణాల అద్దెలు చాలా ఎక్కువగా ఉన్నాయన్న కారణంతోనే ప్రభుత్వం రివర్సు టెండరింగ్ నిర్వహించి రూ. 108 కోట్లు మిగిల్చినట్లు చెప్పారు. పోయిన ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులకు అద్దెల రూపంలో ప్రభుత్వం రూ. 671 కోట్లు చెల్లించిందన్నారు. దాంతో రివర్స్ టెండరింగ్ నిర్వహించిన తర్వాత చెల్లించబోయే అద్దె మొత్తం రూ. 562 కోట్లకు తగ్గిందన్నారు. మద్యపానం తగ్గటం వల్ల నేరాలతో పాటు రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గినట్లు మంత్రి చెప్పారు.