Begin typing your search above and press return to search.
'ఏంటీ ఏడుపు ఆపండి' అన్న కేసీఆర్!
By: Tupaki Desk | 4 Oct 2016 4:53 AM GMTచూడబోతే తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల ఎంపిక అనేది భౌగోళికంగా పరిపాలన సౌలభ్యం కోసం చేస్తున్న ఏర్పాటులాగా కనిపించడం లేదు. లేదా అలా జరుగుతూ ఉన్నప్పటికీ కూడా.. నాయకులు మాత్రం అలా భావించడం లేదు. అదేదో మిఠాయిల పంపకం లాగా తమకు కూడా ఒక జిల్లా కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి దృష్టాంతమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదుట జరిగినప్పుడు ఆయన ఒకింత అసహనంగానే స్పందించినట్లుగా తెలుస్తోంది.
వరంగల్ జిల్లా నాయకులతో సీఎం కేసీఆర్ సోమవారం సమావేశం అయినప్పుడు తన నియోజకవర్గం ములుగు కేంద్రంగా జిల్లా వస్తుందని అనుకున్నానని, అన్యాయం జరిగిందని అంటూ మంత్రి చందూలాల్ కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఎప్పటినుంచో కసరత్తు జరుగుతూ ఉండగా.. ములుగు జిల్లా కావడం ఎలా సబబో ముఖ్యమంత్రికి గతంలోనే నివేదించుకోకుండా.. అంతా అయిపోయిందని అనుకుని.. ఫైనల్ సమీక్షలు చేసేప్పుడు వచ్చి.. కన్నీళ్లు పెట్టుకుంటే ఏం లాభం ఉంటుంది?
చందూలాల్ మరి ఎలా ఆలోచించారో తెలియదు గానీ.. సీఎం కేసీఆర్ మాత్రం.. మంత్రి స్థాయిలో ఉండి ఇలా మాట్లాడడం కరెక్టు కాదంటూ అన్నట్లు తెలుస్తోంది. ప్రజల కోణంలో ఆలోచించి, భూపాలపల్లి జిల్లాకు సహకరించాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఇతర నేతలు బుజ్జగించినా ఫలితం లేకుండా.. సీఎం పీకిన క్లాస్ దెబ్బకి చందూలాల్ మరింత బాధ పడినట్లుగా తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/