Begin typing your search above and press return to search.
సునీల్ యాదవ్‌కు నార్కో ఎనాలసిస్ టెస్ట్? పిటిషన్ వేసిన సీబీఐ
By: Tupaki Desk | 20 Aug 2021 4:20 AM GMTఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచిం ది. గత ఏడాదే విచారణ ప్రారంభించిన సీబీఐ.. కరోనా నేపథ్యంలో కొన్నాళ్లు విచారణ నుంచి విరామం ప్రకటించినా.. ఇటీవలకాలంలో మాత్రం స్పీడ్ పెంచింది. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారిని కడప అతిథి గృహంలో వరుస పెట్టి విచారిస్తున్న సీబీఐ అధికారులు.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో ఆరోపణలు వినిపిస్తున్న సునీల్ యాదవ్‌ను ఇప్పటికే అరెస్టు చేసి, 10 రోజులు కస్టడీకి తీసుకుని విచారించిన విషయం తెలిసిందే.
అయితే.. ఇప్పుడు సునీల్‌కు నార్కొ ఎనాలిసిస్ పరీక్ష నిర్వహించేందుకు కూడా సీబీఐ సిద్ధమైంది. ఈ క్రమంలో జమ్మలమడుగులోని కోర్టులో సీబీఐ పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ క్రమంలో ఈ పిటిషన్‌పై విచారణ చేసిన జమ్మలమడుగు కోర్టు.. అటు సునీల్ యాదవ్ తరఫున లాయర్లు, ఇటు సీబీఐ తరఫు న్యాయవాదుల వాదనలను విని నమోదు చేసుకుంది. దీనిపై విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఇక, సీబీఐ అధికారులు ఈ కేసులో అనుమానితులు గా ఉన్న కడప ఎంపీ.. అవినాష్ రెడ్డి తండ్రి, పులివెందుల వైసీపీ ఇంచార్జ్.. వైఎస్ భాస్కరరెడ్డి, ఆయన సోదరుడు, వైఎస్ మనోహర్ రెడ్డిని.. వరుసగా రెండు రోజుల పాటు గంటల తరబడి విచారించి.. వివరాలు రాబట్టడం గమనార్హం.
ఇక,ఈ విచారణలో భాగంగా ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సునీల్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడు.. భరత్ యాదవ్ సహా.. మరో ఇద్దరు.. మహబూబ్ బాషా, నాగేంద్రలను కూడా విచారించడం గమనార్హం. అదేసమయంలో ఓ హెడ్ కానిస్టేబుల్ సహా మరో వ్యక్తిని కూడా అధికారులు ప్రశ్నించారు. ఇదిలావుంటే.. వివేకా కుమార్తె డాక్టర్ సునీత.. మరోసారి సీబీఐ అధికారులను కలిశారు. విచారణ పురోగతిని ఆమె తెలుసుకున్నారు. ప్రధాన నిందితులుగా ఆమె బావిస్తున్న వారి జాబితాను మరోసారి సీబీఐ అధికారులకు ఇచ్చినట్లు సమాచారం. దీనిలో ఇటీవల సునీల్ కుటుంబం పేర్కొన్న.. పెద్దతలకాయలను వదిలేసి.. చిన్నవారిని ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్న విషయాన్ని సునీత వ్యక్తం చేసినట్టు తెలిసింది.