Begin typing your search above and press return to search.
రేవంత్ బాగోతం బయటపెట్టిన నరేందర్ రెడ్డి!
By: Tupaki Desk | 5 Dec 2018 7:00 AM GMTతెలంగాణవ్యాప్తంగా ఇప్పుడు అందరి దృష్టి ని ఆకర్షిస్తున్న నియోజకవర్గం కొడంగల్. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే - కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. గులాబీ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి నియోజకవర్గం వ్యాప్తంగా ఇంటింటికీ తిరుగుతున్నారు. నేటి తో ప్రచార పర్వానికి తెరపడనుండటంతో ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు ఆయన మరింత వేగంగా పావులు కదుపుతున్నారు.
తాజా గా ఓ ప్రచార ర్యాలీ లో రేవంత్ రెడ్డి పై నరేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రేవంత్ తన పై ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నాడో నరేందర్ అందులో వివరించారు. సొంత మామ(భార్య తండ్రి) చనిపోతే కూడా అంత్యక్రియలకు వెళ్లని దుర్మార్గుడిగా రేవంత్ తన పై విమర్శలు గుప్పిస్తున్నారని తెలిపారు. వాస్తవాలు తెలియని కొంతమంది నిజంగానే ఆ మాటలు విని తనను ద్వేషించుకుంటున్నట్లు తెలిసిందన్నారు.
నిజానికి తన మామ 2000 ఫిబ్రవరి 29న మరణించారని నరేందర్ రెడ్డి చెప్పారు. తన పెళ్లి అదే ఏడాది అక్టోబర్ 13న జరిగిందని తెలిపారు. పెళ్లికి ఏడు నెలల ముందే, ఆ కుటుంబంతో ఏ సంబంధాలూ లేనప్పుడే చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలకు నేనెందుకు వెళ్తానో ప్రజలే ఆలోచించాలని విన్నవించారు. ఇదే తరహాలో రేవంత్ తన పై అన్నీ దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ తండ్రి పై కూడా నరేందర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన ఒక దొంగ అని చెప్పారు. దొంగకు గజదొంగ పుట్టాడంటూ రేవంత్ పై విరుచుకుపడ్డారు. మరి మామ అంత్యక్రియల విషయంలో నరేందర్ రెడ్డి చెప్పిన లాజిక్ కు రేవంత్ ఎలా స్పందిస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.