Begin typing your search above and press return to search.

మోదీ బ‌ల‌హీన ప్ర‌ధానిః రాహుల్ గాంధీ

By:  Tupaki Desk   |   5 July 2017 10:47 AM GMT
మోదీ బ‌ల‌హీన ప్ర‌ధానిః రాహుల్ గాంధీ
X
కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ కొద్ది రోజులుగా మీడియా ముందుకు రాలేదు. ఆయ‌న ఒక ట్వీట్‌ తో అక‌స్మాత్తుగా వార్త‌ల్లోకి వ‌చ్చారు. ప్ర‌ధాని నరేంద్ర మోదీ బ‌ల‌హీన‌మైన ప్ర‌ధాని అని తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు రాహుల్ గాంధీ. అంతేకాడు, కాశ్మీర్ విషయంలో ప్రభుత్వ వైఖరిని నిర‌సిస్తూ ఇండియాకు బలహీనమైన ప్రధాని ఉన్నారని వ్యాఖ్యానించారు.

జూన్ 26వ తేదీన హిజ్ బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ఆ సంద‌ర్భంలో 'భారత పాలిత జమ్మూ కాశ్మీర్ ప్రాంతం' అని అమెరికా సంబోధించడాన్ని మోదీ సర్కారు ఒప్పుకుందని ఆయన ఆరోపించారు. భారత్ లో అంతర్భాగమైన ప్రాంతాన్ని భారత పాలిత ప్రాంతమని ఎలా సంబోధిస్తార‌ని, అమెరికా వ్యాఖ్యను ఎందుకు ఖండించలేదని రాహుల్‌ ప్రశ్నించారు.

ట్రంప్‌ తో ఫొటోలు దిగ‌డానికే మోదీ అమెరికాలో ప‌ర్య‌టించిన‌ట్లుంద‌ని కాంగ్రెస్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. హెచ్‌1బీ వీసాలకు సంబంధించి ఎటువంటి చ‌ర్చ‌లు జ‌ర‌గ‌లేద‌ని పేర్కొంది. వారి మ‌ధ్య ముఖ్య‌మైన అంశాలు చ‌ర్చ‌కు రాలేద‌ని తెలిపింది.

కాగా, సలాహుద్దీన్ ను ఉగ్రవాదని చెబుతున్న వేళ, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రస్తావిస్తూ, అమెరికా ఆ పదాన్ని వాడి ఉండవచ్చని విదేశీ వ్యవహారాల శాఖ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.