Begin typing your search above and press return to search.
మోడీ ఒప్పుకుంటున్నారు....
By: Tupaki Desk | 9 April 2015 11:25 AM GMT ప్రధానమంత్రి నరేంద్రమోడీ మౌనం వీడారు. పార్టీ ఎంపీలు, నేతలు చేస్తున్న విమర్శలు మొదలుకొని, ఢిల్లీలో బీజేపీ ఓటమి, ఇటీవలే జమ్మూకశ్మీర్ లో ఏర్పడిన పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలు, తన హవా తగ్గుతోందన్న వాదనలు అన్నింటిపై మోడీ మీడియాతో మాట్లాడుతూ స్పందించారు.
బీజేపీ మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ మధ్యకాలంలో తరచుగా చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలను మోడీ ఖండించారు.అవి సరైనవి కాదని స్పష్టం చేశారు. రాజ్యసభలో ఎదురవుతున్న ప్రతిబంధకాలపై ప్రధాని మాట్లాడుతూ అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని చెప్పారు. ఈ దిశగా మిత్రపక్షాలు, ప్రతిపక్షాలకు స్వయంగా తానే విజ్ఞప్తి చేశానని ఈ నేపథ్యంలో పార్టీలన్నీసహకరిస్తాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. సుపరిపాలన, ప్రజాభాగస్వామ్యంతో అన్ని సమస్యలను అధిగమించే సత్తా తమ ప్రభుత్వానికి ఉందన్నారు.
ఢిల్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయం పై అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ ఢిల్లీ ప్రజల తీర్పును గౌరవిస్తామన్నారు. అదే సందర్భంలో దేశప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని, గౌరవాన్ని కాపాడుకుంటామన్నారు. జమ్మూకశ్మీర్ ఏర్పడిన పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో కొన్ని సమస్యలున్న మాట వాస్తవమేనని తొలిసారిగా అంగీకరించారు. కానీ అవన్నీ చిన్న చిన్న సమసస్యలు అని, కొద్దిగా ఓపిక పడితే అవన్నీ పరిష్కారమవుతాయని చెప్పారు. వేర్పాటువాద నేత మస్రత్ అలీ విడుదలపై కేంద్రంతో సంప్రదించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. అయితే జాతికి విఘాతం కలిగించే శక్తులను, టెర్రరిస్టులను ఉపేక్షించేదిలేదని ఈ విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తన హవా తగ్గుతోందన్న వాదనలను కొట్టి ప్రధాని కొట్టి పారేశారు.