Begin typing your search above and press return to search.
కమలనాథులకు..భండార్కర్ దారి చూపారా?
By: Tupaki Desk | 22 Jun 2017 5:50 AM GMTనిజమే... బాలీవుడ్ దర్శకుడు మాధుర్ భండార్కర్ కమలనాథులుగా మనం పిలుచుకుంటున్న బీజేపీ నేతలకు ఓ మంచి దారే చూపించారు. దేశాన్ని ఏలుతున్న బీజేపీ నేతలకు ఓ సినీ దర్శకుడు దారి చూపడమంటే వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా... ఇది ముమ్మాటికీ నిజమేనని చెప్పాలి. ఎందుకంటే... కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇందిరా గాంధీ హయాంలో దేశంలో అమలైన ఎమర్జెన్సీపై మాధుర్ భండార్కర్ *ఇందూ సర్కార్* పేరిట ఓ చలన చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సదరు చిత్రాన్ని ఆయన వచ్చే నెల 28న విడుదల చేయనున్నారు కూడా.
ఈ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రతో పాటు నాటి ఎమర్జెన్సీలో ప్రభుత్వానికి సమాంతర పాలన సాగించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్న ఇందిరా గాంధీ తనయుడు - దివంగత కాంగ్రెస్ నేత సంజయ్ గాంధీ పాత్రను కూడా భండార్కర్ మన కళ్లకు కడుతున్నారు. ఇక 21 నెలల పాటు దేశంలో అమలైన ఎమర్జెన్సీ సమయంలో నాటి దేశ ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా ఆయన తన చిత్రంలో చూపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి లీకైన కొన్ని విషయాలు తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నేతలు భండార్కర్ పై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. తమ నేతను చిత్రంలో తప్పుగా చిత్రీకరించారని, దీనిని తాము ఒప్పుకునేది లేదని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
సరిగ్గా ఇదే విషయాన్ని వెనువెంటనే క్యాచ్ చేసేసిన ప్రధాని నరేంద్ర మోదీ... ఎమర్జెన్సీ సమయంలో చోటుచేసుకున్న భయానక వాతావరణాన్ని దేశ ప్రజలకు గుర్తు చేసేందుకు నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో కలిసి చర్చలు జరిపిన మోదీ... ఈ కార్యక్రమానికి పక్కాగా ప్లాన్ రెడీ చేసేశారు. ఈ ప్లాన్ ప్రకారం ఈ నెల 25న మోదీ కేబినెట్ లోని మంత్రులు దేశంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఒక్కో ప్రాంతం బాధ్యతలను ఒక్కో మంత్రికి అప్పగించిన మోదీషాలు... నాటి ఎమర్జెన్సీ చేదు జ్ఞాపకాలను ప్రజలకు కళ్లకు కట్టినట్టు వివరిస్తారట. వెరసి ఇప్పటికే గడచిన ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీని ప్రజల దృష్టిలో కుట్రదారుగా, నేరస్తురాలిగా చూపిస్తారట. ఫలితంగా వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని మరింత బలహీనపరచడమే కాకుండా... 2019 ఎన్నికల్లో మరోమారు కేంద్రంలో అధికారం దక్కించుకునేందుకు మోదీషాలు ఈ ప్లాన్ ను అత్యంత పకడ్బందీగా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/