Begin typing your search above and press return to search.
మోదీ మంత్రం... సొంత రాష్ట్రంలో సొంతొళ్లకే షాక్!
By: Tupaki Desk | 13 Nov 2017 1:28 PM GMTగుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ - బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ద్వయం అమలు చేస్తారని ప్రచారంలో ఉన్న వ్యూహం బీజేపీ నేతల్లో గుబులు రేపుతోంది. అదే నిజమైతే తమ ఆశలపై నీళ్లు చల్లినట్లేనని పలువురు ఎమ్మెల్యేలు భావిస్తున్నారట. దీంతో మోదీ - షా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని వారంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారట.
విషయమేమిటంటే.. గుజరాత్ లో గత 20ఏళ్లకు పైగా బీజేపీ పాలన కొనసాగుతోంది. ముఖ్యంగా 2001లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన మోదీ ప్రధాని అయ్యేవరకూ కొనసాగారు. ఆయన తన హయాంలో ఎదురులేకుండా పాలన సాగించారు. మరొకరికి అవకాశం దక్కకుండా పక్కా వ్యూహంతో ముందుకెళ్లారు. దీనికి ఒకనాటి ఆయన అనుచరుడు - ఇప్పటి బీజేపీ సారథి అమిత్ షా కూడా సహకరించారు. వీరిద్దరూ కలిసి తాజా ఎన్నికల్లోనూ గతంలో తాము అమలు చేసిన వ్యూహాన్ని అమలు చేస్తారా? అనే చర్చ సాగుతోంది. అదే జరిగితే పలువురు సిట్టింగులకు టిక్కెట్లు దక్కవని సమాచారం. మోదీ సీఎం పదవి వదిలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గుజరాత్ లో పరిస్థితులు ప్రస్తుతం బీజేపీకి ప్రతికూలంగా మారాయి. హార్దిక్ పటేల్ - జిగ్నేష్ హేవానీ - అల్పేష్ ఠాకూర్ ల కారణంగా కమలం పార్టీ ఇబ్బందులు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి.
అంతేకాకుండా రెండు దశాబ్దాలుగా అధికారంలో కొనసాగుతున్న బీజేపీపై ప్రజా వ్యతిరేకతనూ కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రజావ్యతిరేకత - స్థానిక సమస్యలు - పటేళ్ల ఉద్యమం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని మోడీ-షా ద్వయం తమ వ్యూహంలో భాగంగా.. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించవచ్చని వారు భావిస్తున్నారు. 2002లో కేవలం 18 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండిచేయి చూపిన మోడీ.. 2007లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 47 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్ నిరాకరించారు. 2012లో దాదాపు ముప్పై మందికి టిక్కెట్ ఇవ్వలేదరు. ఈసారి ప్రజా వ్యతిరేకత - హార్థిక్ పటేల్ - జిగ్నేష్ - అల్పేష్ ల ప్రభావం - స్థానిక కారణాలతో ఎంతమందికి టిక్కెట్ నిరాకరిస్తారోననే భయం ఆ పార్టీ ఎమ్మెల్యేలను వేధిస్తోంది.
మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా అధికారం హస్తగతం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. అందుకోసం యువతను లక్ష్యంగా చేసుకుంది. యువ నేతల సాయం తీసుకోవడంతో పాటు క్షత్రియ - హరిజన్ - ఆదివాసీ - ముస్లీం ఫార్ములానూ ఉపయోగిస్తోంది. దీంతో కాంగ్రెస్ గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా బలంగా మారింది. దీంతో బ్రాహ్మణ - బనియా - ఓబీసీలు వర్గాలు.. ముఖ్యంగా ఓబీసీల్లో కోలీలు బీజేపీ వైపు ఉండే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.