Begin typing your search above and press return to search.
మోదీ షా ప్లాన్ సక్సెస్..కశ్మీర్ విభజనకు ఇక అడ్డే లేదబ్బా!
By: Tupaki Desk | 5 Aug 2019 3:57 PM GMTజమ్మూ కశ్మీర్ కు డెబ్బై ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడంతో పాటు ఆ రాష్ట్రంలో ఇక ఉగ్రవాదులపై ముప్పేట దాడి చేసి తరిమికొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి హోదాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రచించిన వ్యూహం ఘన విజయం సాధించిందనే చెప్పాలి. రాజ్యాంగంలోని 370 ఆర్టికల్ పుణ్యమా అని దేశంలో కొత్తగా రూపొందే ఏ చట్టం కూడా జమ్మూ కశ్మీర్ లో అమలయ్యే ప్రసక్తే లేదు. అంతేనా... దేశంలోని ఇతర ప్రాంతాల కంటే మూడింతల నిధులు ఇస్తున్నా... కశ్మీర్ లో అభివృద్ధి జాడే కనిపించడం లేదు. అంతేనా నిత్యం ఉగ్రమూకల రెచ్చగొట్టే వ్యాఖ్యలు - చర్యలతో అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేదంటే అతిశయోక్తి కాదేమో. ఈ తరహా పరిస్థితికి స్వస్తి చెప్పేద్దామంటూ మోదీ షాలు కదిలిన తీరు నిజంగానే అభినందనీయమన్న వాదన వినిపిస్తోంది.
కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడంతో పాటుగా అక్కడి పరిస్థితిపై కేంద్రానికి అదుపు ఉండాలన్న దిశగా మోదీ సర్కారు కదిలితే... అనూహ్యంగా వైరి వర్గాల నుంచి కూడా మోదీ షా లకు మద్దతు దక్కింది. వెరసి కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి తీసేసి - ఆ ప్రాంతానికి అసలు రాష్ట్ర స్థాయే లేకుండా కేంద్ర పాలిత ప్రాంతంగా - అది కూడా రెండు రకాల కేంద్ర పాలిత ప్రాంతాలుగా కశ్మీర్ ను విడదీసినా కూడా విపక్షాల నుంచి కూడా మద్దతు దక్కేసింది. ఈ విషయంలో రాజకీయంగా బీజేపీని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని మార్చుకోకపోగా... బీజేపీకి వ్యతిరేకంగా తనదైన శైలి పోరాటం చేస్తున్న టీడీపీ - ఆప్ - బీఎస్పీ తదితర పార్టీలన్నీ మోదీ షాల నిర్ణయానికి మద్దతు పలకడం అంటే మాటలు కాదు కదా. మొత్తంగా కశ్మీర్ విభజనను అడ్డుకునే ఏ శక్తి లేని రీతిగా అమిత్ షా రచించిన వ్యూహం గ్రాండ్ సక్సెస్ అయ్యిందని చెప్పాలి. కశ్మీర్ కు స్వయంప్రతిపత్తిని రద్దు చేయడంతో పాటు ఆ ప్రాంతాన్ని రెండు ముక్కలు చేస్తూ కేంద్రం ప్రతిపాదించిన బిల్లుకు ఇప్పటికే పెద్దల సభ రాజ్యసభ ఆమోదం తెలిపింది. తన వ్యూహంలో భాగంగా లోక్ సభలోనూ ఈ బిల్లుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసే క్రమంలో అమిత్ షా ఈ బిల్లును ఇప్పటికే లోక్ సభలోనూ ప్రవేశపెట్టారు. మంగళవారం దీనిపై లోక్ సభలో విస్తృత చర్చ జరగనుంది.
చర్చ ఎలా జరిగినా కూడా లోక్ సభలోనూ ఈ బిల్లుకు ఆమోద ముద్ర పడటం గ్యారెంటీ అన్న వాదన వినిపిస్తోంది. ఇక రాజ్యసభలో ఈ బిల్లుకు ఆమోదం విషయానికి వస్తే... బిల్లుకు మద్దతుగా 125 ఓట్లు పడితే... వ్యతిరేకంగా 61 ఓట్లు మాత్రమే వచ్చాయి. బిల్లుకు మద్దతుగా ఎన్డీఏలోని జేడీయూ మినహా అన్ని పార్టీలు మద్దతు పలికాయి. ఇక బీజేపీకి దూరం దూరంగానే ఉంటున్న వైఎస్సార్ సీపీ - టీఆర్ ఎస్ - టీడీపీ - బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ - బీఎస్పీ - ఆప్ తదితర పార్టీలన్నీ మద్దతు పలికాయి. ఇక ఈ బిల్లుకు కాంగ్రెస్ పార్టీతో పాటు ఎస్పీ - జేడీయూ - డీఎండీకే - డీఎంకే - సీపీఎం - పీడీపీ - ఎన్సీపీ - ఎన్సీ పార్టీలు వ్యతిరేకంగా ఓటేశాయి. ఎన్డీయే భాగస్వామి జేడీయూ - కాంగ్రెస్ మిత్రపక్షం ఎన్సీపీ బిల్లుపై ఓటింగ్ కు దూరంగా ఉంటామని విస్పష్టంగా ప్రకటించాయి. ఇది పరోక్షంగా ఓటింగ్ లో బీజేపీ సర్కారుకు లాభించేదే. మొత్తంగా కశ్మీర్ బిల్లుకు ఆమోదం దక్కించుకునే విషయంలో మోదీ షాల వ్యూహం విజయవంతమైందనే చెప్పక తప్పదు.