Begin typing your search above and press return to search.

ఎన్నిక‌ల వేళ ప్లాన్ బీ రెఢీ చేసుకున్న బీజేపీ

By:  Tupaki Desk   |   15 April 2019 5:38 AM GMT
ఎన్నిక‌ల వేళ ప్లాన్ బీ రెఢీ చేసుకున్న బీజేపీ
X
దేశ రాజ‌కీయాల్లో మోడీషా ద్వ‌యం తీరు భిన్నం. సంప్ర‌దాయ రాజ‌కీయాల‌కు వారి తీరు ఏ మాత్రం పొస‌గ‌దు. ప్ల‌స్ గురించి ఆలోచిస్తూనే.. మైన‌స్ గురించి ఆలోచించి.. అందుకు త‌గ్గ‌ట్లు ప్లాన్ సిద్ధం చేయ‌టంలో వారికి వారే సాటి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గెలుపు ధీమాను ప్ర‌ద‌ర్శించే మోడీ మాష్టారు.. ఒక‌వేళ త‌న లెక్క త‌ప్పితే ఏం చేయాల‌నే దానిపైనా ప్లాన్ బీని సిద్ధం చేసిన‌ట్లు చెబుతున్నారు.

2014 తీర్పున‌కు భిన్నంగా తాజా ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌స్తాయ‌ని ప‌లువురు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీకి 110ఎంపీ స్థానాలు కూడా రావ‌ని బీజేపీ అంచ‌నా వేస్తుంది. ఇంత‌మంది లెక్క‌లు చెబుతున్న బీజేపీ త‌న‌కు సంబంధించి ఎలాంటి లెక్క‌లు వేసుకుంటుంద‌న్న విష‌యంలోకి వెళితే.. మోడీషాలు ప్రాక్టిక‌ల్ గా ఆలోచిస్తున్నార‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

తాము అంచ‌నా వేస్తున్న‌ట్లుగా మెజార్టీ వ‌స్తే ఓకే. ఒక‌వేళ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేంత బ‌లం త‌మ‌కు రాకుంటే.. ఏం చేయాల‌న్న దానిపైనా మోడీషాలు ఇప్ప‌టికే ఒక క్లారిటీతో ఉన్న‌ట్లు చెబుతున్నారు. బీజేపీ క‌నుక సొంతంగా 200 స్థానాల్లో గెలిస్తే.. త‌మ‌కు ఇబ్బంది పెట్ట‌ని మిత్ర‌ప‌క్షాల‌తో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే ఆలోచ‌న చేస్తుంద‌ని చెబుతున్నారు. ఒక‌వేళ అందుకు భిన్నంగా ఫ‌లితం ఉంటే.. వెంట‌నే ప్లాన్ బీని తెర మీద‌కు తీసుకురావాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

200 కంటే త‌క్కువ స్థానాల్లో గెలిచిన ప‌క్షంలో ప్ర‌భుత్వ ఏర్పాటు విష‌య‌మై బీజేపీ ఆలోచించ‌కూడ‌ద‌ని.. బుద్ధిగా ప్ర‌తిప‌క్షంలో కూర్చోవాల‌ని డిసైడ్ అయిన‌ట్లుగా చెబుతున్నారు. అలాంటి ప‌రిస్థితి వ‌స్తే.. అమిత్ షా పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేసి.. విప‌క్ష నేత‌గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టే వీలుంద‌ని చెబుతున్నారు. ఎందుకిలా అంటే.. నితిన్ గ‌డ్క‌రీకి చెక్ పెట్టేందుకేన‌ని చెబుతున్నారు.

ప్ర‌ధాని మోడీ సీటుకు రేసు న‌డుస్తోంద‌ని.. గ‌డ్క‌రీ ఆ రేసులో ముందున్నార‌ని చెబుతారు. గెలిస్తే ప్ర‌ధాని రేసులో.. మ‌రి.. ఓడితే అన్నప్పుడు విప‌క్ష నేత రేసులోకి రావ‌టం ఖాయం. ఇంత బ‌తుకు బ‌తికి మోడీ మాష్టారు విప‌క్ష నేత‌గా వ్య‌వ‌హ‌రించ‌టానికి అస్స‌లు ఇష్ట‌ప‌డ‌రు. అలాంట‌ప్పుడు లిస్ట్ లో పేరు గ‌డ్క‌రీదే వ‌స్తుంది. అలాంటి అవ‌కాశాన్ని ఇవ్వ‌కుండా త‌న‌కు స‌న్నిహితుడైన షాకు ఆ ప‌ద‌వి అప్ప‌గిస్తే బాగుంటుంద‌న్న ఆలోచ‌న‌లో మోడీ ఉన్నారు. ఈ కార‌ణంతోనే షాను.. అద్వానీ ప్రాతినిధ్యం వ‌హించే గాంధీన‌గ‌ర్ స్థానం నుంచి పోటీకి దింపిన‌ట్లుగా తెలుస్తోంది. మ‌రి.. మోడీషాలు సిద్ధం చేసిన ప్లాన ఏ వ‌ర్క్ వుట్ అవుతుందా? ప్లాన్ బీ అవ‌స‌రం వ‌స్తుందా? అన్న‌ది తేలాలంటే మే 23 వ‌ర‌కూ వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు.