Begin typing your search above and press return to search.
బీజేపీ.. లాస్ట్ మినిట్ ప్లాన్ బి.. ఇదే..
By: Tupaki Desk | 19 Nov 2018 5:30 AM GMTటీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళుతూ 105 మంది అభ్యర్థులను ప్రకటించేసి ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసిరారు. ఆ స్పీడును అందుకునేందుకు ప్రతిపక్షాలకు తలకు మించిన భారమైంది. నామినేషన్ ముగింపు దశకు వచ్చిన వేళ కాంగ్రెస్ పార్టీ మిగిలిన అభ్యర్థులను ప్రకటించాల్సిన దుస్థితికి వచ్చింది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తెలంగాణలో నాయకులే దొరకని పరిస్థితి నెలకొంది. మొదట 30కు పైగా అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ ప్రధానంగా టీఆర్ ఎస్ - కాంగ్రెస్ టికెట్ దక్కని వారిపైనే ఆశలు పెంచుకుంది. టీఆర్ ఎస్ నుంచి ఒకరిద్దరు వచ్చినా.. కాంగ్రెస్ రెబల్స్ పైనే ప్రయత్నాలు చేసింది. కానీ కాంగ్రెస్ తెలివిగా.. నామినేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత టికెట్లు ప్రకటించడంతో అటు రెబల్స్ - ఇటు బీజేపీ కూడా ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో పడిపోయాయి. కాంగ్రెస్ మైండ్ గేమ్ ముందు రెబల్స్ దెబ్బైపోయారు. వస్తారనుకున్న నాయకులను చివరి నిమిషంలో చేర్చుకొని బీజేపీ పూర్తిస్థాయిలో అభ్యర్థులను దించేసింది.
మొత్తం 119 స్థానాల తెలంగాణ అసెంబ్లీలో చాలా మందిని అరువుతీసుకొచ్చి 100 మందికి పైగా అభ్యర్థులను బీజేపీ భర్తీ చేసింది. ఇప్పుడు ఎన్నికల ముందర మొత్తం భారం మోడీపైనే వేసింది. మోడీ ముఖం చూసే ఓట్లు పడుతాయని భావిస్తోంది. చివరి నిమిషంలో ప్రధానమంత్రి ప్రచారానికి బీజేపీ రాష్ట్ర నేతలు ఖరారు చేశారు. మోడీ డిసెంబర్ 3 - 5 వ తేదీల్లో తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. ఇక్కడ నాలుగు సభల్లో ప్రసంగించనున్నారు. సోనియాగాంధీ - రాహుల్ గాంధీ తెలంగాణలో ప్రచారం చేస్తున్న సమయంలోనే మోడీ తెలంగాణకు రాబోతుండడం విశేషంగా చెప్పవచ్చు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా - ఇతర బీజేపీ ముఖ్యమంత్రులు - కేంద్రమంత్రులు మోడీ ప్రచారానికి ముందు తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. దీనికోసం రూట్ మ్యాప్ ఖారారైంది.
రాష్ట్ర బీజేపీ నేతల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. మోడీ నిజామాబాద్ - వరంగల్ - నల్గొండ - హైదరాబాద్ లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. మోడీని చివరి నిమిషంలో ప్రచారానికి దింపుతున్న కమలదళం వ్యూహం తెలంగాణ ఎన్నికల్లో ఫలిస్తుందో లేదో చూడాలి మరి.
తెలంగాణ ఎన్నికల్లో ఇప్పుడు టీఆర్ ఎస్ ప్రథమ స్థానంలో ఉండి ప్రచారంలో దూసుకెళ్తోంది. ప్రతిపక్షాలన్ని మహాకూటమి పేర ప్రతిపక్షాలన్నీ జతకట్టి బలంగా ముందుకెళ్లబోతున్నాయి. ఈ రెండింటినుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న బీజేపీ వ్యూహాత్మకంగా కదులుతోంది. టీఆర్ ఎస్ - మహాకూటమి పోరులో రెండింటికి మెజార్టీ తగ్గితే కింగ్ మేకర్లం తామే అవుతామని.. తెలంగాణ చరిత్రలో తొలి సంకీర్ణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించబోతున్నామని బీజేపీ నేతలు ఆశలు పెంచుకున్నారు. హంగ్ ఏర్పడితే టీఆర్ఎస్ తో కలిసి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే అవకాశాలుండడంతో బీజేపీ శ్రేణులు అందుకు సరిపడా గెలిచే అభ్యర్థులపై ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. బీజేపీ నుంచి ఆ అభ్యర్థుల గెలుపునకు సరిపడా ఆర్ఎస్ఎస్ సిబ్బంది, కార్యకర్తలతో పాటు పెట్టుబడిని కూడా అందించినట్టు వార్తలొస్తున్నాయి.. చూడాలి మరి.. లాస్ట్ మినిట్ స్ట్రాటజీతో బీజేపీ ఏమేరకు తెలంగాణలో ఫలితాలు సాధిస్తుందో..