Begin typing your search above and press return to search.
మోడీకి మించి తిరిగినా రాహుల్ శ్రమకు ఫలితం దక్కలేదు
By: Tupaki Desk | 23 May 2019 4:18 AM GMTఎన్నికల ప్రచారం ముగిసిపోయింది. పోలింగ్ దశలూ పూర్తి అయ్యాయి. నెలల తరబడి ఎంతో ఆసక్తిగా చూస్తున్న బిగ్ డే వచ్చేసింది. కౌంటింగ్ కేంద్రాల్లో మహా జోరుగా ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈ సమయంలో ఫలితాల మీద అందరి దృష్టి ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్లే ఫలితాలు వస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఇలాంటివేళ.. కాస్త వెనక్కి వెళ్లి.. ఎన్నికల ప్రచారం సందర్భంగా మోడీ.. రాహుల్ ఇద్దరూ తిరిగిన ప్రాంతాలు.. నిర్వహించిన సభలు.. మాట్లాడిన విలేకరుల సమావేశాలు.. ప్రస్తావించిన అంశాల్ని పరిశీలిస్తే.. ఒక్క విషయం మాత్రం స్పష్టమవుతుంది.
ఇరువురు నేతలు.. ఎవరికి వారు తమ శక్తి మేరకు కష్టపడ్డారని చెప్పక తప్పదు. కష్టంలో ఇరువురు ఒకేలా కనిపించినా.. రాహుల్ మరికాస్త ఎక్కువగా కష్టపడినట్లు కనిపించక మానదు. ఒక అంచనా ప్రకారం ఈ ఇరువురు నేతలు తాజా ఎన్నికల సందర్భంగా ఒక్కొక్కరు లక్ష కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసినట్లుగా చెప్పక తప్పదు. వందలాది సభల్లో పాల్గొన్న వారి కష్టం.. ఓటర్లను ఎంత ప్రభావితం చేసిందన్న విషయంపై ఈ మధ్యాహ్నానానికి క్లారిటీ రాక మానదు.
ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచారాన్ని మోడీతో పోలిస్తే రాహుల్ చాలా ముందుగా షురూ చేశారు. రాహుల్ ఫిబ్రవరి 3న స్టార్ట్ చేస్తే.. మోడీ మాత్రం మార్చి 28న షురూ చేశారు. దాదాపు యాభై రోజులు ఆలస్యంగా ప్రచారం చేసినా.. రాహుల్ కంటే ఎక్కువగా ఓటర్లను ప్రభావితం చేశారని చెప్పాలి. ఎన్నికల ప్రచారాన్ని లేటుగా స్టార్ట్ చేసినా అమితవేగంగా కవర్ చేశారని చెప్పాలి.
ప్రధాని మోడీ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా 142 సభల్లో పాల్గొనగా.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 145 సభల్లో పాల్గొన్నారు. మోడీ నాలుగు రోడ్ షోలు నిర్వహించగా.. రాహుల్ గాంధీ ఐదు రోడ్ షోలు నిర్వహించారు. మోడీ ఒక్క విలేకరుల సమావేశంలో పాల్గొన లేదు. కానీ.. రాహుల్ మాత్రం ఏకంగా ఎనిమిది విలేకరుల సమావేశంలో పాల్గొనటం విశేషం. రాహుల్ ప్రాధాన్యమిచ్చిన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్.. పశ్చిమబెంగాల్.. ఒడిశా.. బిహార్ లు కాగా.. మోడీ
ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. దేశ భద్రత.. జాతీయ వాదం అంశాలకు ప్రధాని మోడీ ప్రాధాన్యత ఇస్తే.. నిరుద్యోగం.. రైతుల సమస్యలు ..నోట్ల రద్దు.. జీఎస్టీ.. రఫేల్ కుంభకోణం.. న్యాయ్ అంశాల మీద రాహుల్ అధిక ప్రాధాన్యత ఇవ్వటం కనిపించింది.