Begin typing your search above and press return to search.
మోడీ యాప్ హ్యాక్..సొరంగాల వెతుకులాట
By: Tupaki Desk | 3 Dec 2016 10:50 AM GMTజమ్ములోని సాంబా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వెంట 70 అడుగుల పొడవున సొరంగం తవ్వి భారత్ లోకి ఉగ్రవాదులు చొరబడినట్టు సరిహద్దు రక్షణ దళం (బీఎస్ ఎఫ్) గుర్తించడం కలకలం రేపిన నేపథ్యంలో ఆర్మీ తగు చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం పట్టుబడినట్లే...మరికొన్ని సొరంగమార్గాలు ఉండే అవకాశం ఉందని, వాటిని పూర్తిస్థాయిలో గుర్తించి ధ్వంసం చేయాలని నిర్ణయించింది. జమ్ము సరిహద్దు జిల్లాలైన కతువా - సాంబాలలో సొరంగమార్గాల ద్వారా చొరబడటానికి ఇక ఏమాత్రం అవకాశం ఇవ్వబోమని బీఎస్ ఎఫ్ వర్గాలు అంటున్నాయి. నగ్రొట ఆర్మీ యూనిట్ పై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భద్రత మెరుగుకు మరింత ఆస్కారం ఏర్పడిందని, అలసత్వం కూడా వీడుతుందని కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు.
ఇదిలాఉండగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ యాప్ ను ముంబైకి చెందిన జావేద్ ఖత్రీ (22) అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ - మొబైల్ యాప్ డెవలపర్ హ్యాక్ చేశాడు. ప్రధాని మోడీ యాప్ లో భద్రాతాలోపం తెలియజేయాలని హ్యాక్ చేసినట్టు ఎన్డీటీవీకి జావేద్ చెప్పారు. దాదాపు 70 లక్షల మంది యూజర్లు ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోగా, వారి వివరాలు జావేద్ సంపాదించాడు. అంతేకాదు వారి వివరాలు - ఈ-మెయిల్స్ - మంత్రుల ఫోన్ నంబర్లు జావేద్ రాబట్టగలిగాడు. అయితే ప్రధాని మోడీ యాప్‌కు భద్రతాపరమైన చర్యలు తీసుకున్నామని బీజేపీ వర్గాలు తెలిపాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/