Begin typing your search above and press return to search.

తన కేబినెట్లో మంత్రులకు టికెట్లు ఇవ్వని మోడీ!

By:  Tupaki Desk   |   22 March 2019 11:35 AM IST
తన కేబినెట్లో మంత్రులకు టికెట్లు ఇవ్వని మోడీ!
X
భారతీయ జనతా పార్టీ లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితా ఆసక్తిదాయకంగా ఉంది. 184 మందితో బీజేపీ తన తొలి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తొలి దశ ఎన్నికలు ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులను ఇందులో ప్రధానంగా పేర్కొన్నారు. ఈ జాబితాలో అనేక చర్చనీయాంశాలున్నాయి.

అద్వానీని తప్పించారు. ఆ స్థానంలో అమిత్ షా రంగంలోకి దిగుతున్నారు. అందుకు సంబంధించి చర్చోపచర్చలు సాగుతూ ఉన్నాయి.

ఆ సంగతలా ఉంటే.. మోడీ కేబినెట్లోని ఇద్దరు మంత్రులకు కూడా ఈ సారి ఎంపీ టికెట్లు దక్కకపోవడం విశేషం. కేంద్ర వ్యవసాయ - రైతాంగ సంక్షేమ శాఖ మంత్రి కృష్ణ రాజ్ కు బీజేపీ ఎంపీ టికెట్ దక్కలేదు. వీరు యూపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరి స్థానంలో వేరే అభ్యర్థిని రంగంలోకి దింపింది.

కేవలం ఈ మంత్రిగారే కాకుండా.. యూపీకి సంబంధించిన తొలి జాబితాలో ఏకంగా ఆరు మంది సిట్టింగ్ ఎంపీలను బీజేపీ పక్కన పెట్టింది. గత ఎన్నికల్లో బీజేపీకి బాగా అండగా నిలిచింది యూపీనే. అలాంటి చోట తొలి దశలోనే ఆరు మందిని పక్కన పెట్టారు.

ఇక తొలి జాబితా అనంతరం టికెట్ దక్కించుకోలేకపోయిన మరో మంత్రి విష్ణు దేవ్ సాయి. ఉక్కు శాఖ సహాయ మంత్రి అయిన ఈయన నాలుగు సార్లు ఎంపీగా నెగ్గారు. చత్తీస్ ఘడ్ లోని రాయగడ్ నుంచి వరస విజయాలు సాధించారు. అయితే ఈ సారి ఈయనకు టికెట్ దక్కలేదు. ఇలా మోడీ కేబినెట్లోని మంత్రులకే ఎంపీ టికెట్లు దక్కకపోవడం విశేషం.