Begin typing your search above and press return to search.
మోడీ సంతోషాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్ ప్రయత్నం
By: Tupaki Desk | 18 Dec 2017 4:39 PM GMTగుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల ద్వారా సంస్కరణలకు దేశం రెడీగా ఉందని ఫలితాలు నిరూపించారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్ లో సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ మంత్రం ఫలించిందన్న ఆయన..ప్రచారంలో నాలుగు వైపుల నుంచి బీజేపీపై దాడి జరిగిందన్నారు. గుజరాత్ - హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ గెలిచిన అనంతరం ప్రధాని ఢిల్లీలో మాట్లాడారు. గుజరాత్ విజయం తనకు రెట్టింపు సంతోషాన్నిచ్చిందన్నారు. తాను రాష్ట్రం విడిచి వెళ్లినా.. సహచర నేతలు అభివృద్ధి పనులను కొనసాగించారన్నారు. గుజరాత్ లో సుపరిపాలన వల్లే ప్రజలు మళ్లీ అవకాశం ఇచ్చారన్నారు. గుజరాత్ లో ఐక్యత మంత్రంతో అందరినీ కలుపుకొని ముందుకెళ్దామని ప్రధాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
గుజరాత్ ప్రజలు అభివృద్ధికే ఓటేశారని ప్రధాని మోడీ అన్నారు. ఈ సందర్భంగా ఓట్లేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తనను ఎంతో నీచంగా పోల్చుతూ మాట్లాడిన కాంగ్రెస్ కు ప్రజలు ఓట్లతో గుణపాఠం చెప్పారన్నారు. జీఎస్టీ పేరుతో కాంగ్రెస్ అసత్య ప్రచారం చేసిందని, అయితే జీఎస్టీ ప్రకటించిన తర్వాతే మహారాష్ట్రలోనూ బీజేపీ గెలిచిందన్నారు. త్వరలో చేపట్టే ప్రగతి యాత్రకు అడ్డుపడొద్దన్న మోడీ..2014 తర్వాత దేశంలో వికాస యాత్ర మొదలైందన్నారు. వ్యక్తిగత ఆరోపణలతో కాంగ్రెస్ రెచ్చగొట్టిందన్నారు. సంతోషాన్ని తగ్గించేందుకు కుటిల ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్.. ఎగ్జిట్ పోల్స్ రాగానే ఆందోళన పడ్డారని మోడీ అన్నారు.
గుజరాత్ విజయం తనకు రెట్టింపు సంతోషాన్నిచ్చిందన్నారు. తాను రాష్ట్రం విడిచి వెళ్లినా.. సహచర నేతలు అభివృద్ధి పనులను కొనసాగించారన్నారు. హిమాచల్ ప్రదేశ్ ప్రజలు అభివృద్ధి కోసమే బీజేపీని గెలిపించారని ప్రధాని అన్నారు. గుజరాత్ - హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించడంపై సంతోషం వ్యక్తం చేశారు.