Begin typing your search above and press return to search.
పిల్లల దెబ్బకు కింద పడబోయిన మోడీ
By: Tupaki Desk | 15 Aug 2015 11:58 AM GMTఅవును చెట్టంత ప్రధానమంత్రి మోడీ చిన్నపిల్లాడిలా త్రోటుపాటుకు గురై పడిపోయే పరిస్థితికి చోటు చేసుకున్న ఘటన స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల సందర్భంగా చోటు చేసుకుంది.
ఎర్రకోట మీద జాతీయ జెండాను ఎగుర వేసేందుకు వచ్చిన ప్రధాని మోడీ.. జెండా ఎగురేసి.. తనదైన శైలిలో జాతిని ఉద్దేశించి ప్రసంగించి.. పలువురిలో ఉత్తేజాన్ని నింపిన ఆయన.. అనంతరం వేదిక కిందకు దిగి.. అక్కడున్న పిల్లలతో కరచాలనం చేయాలని భావించారు. స్వయాన ప్రధానమంత్రి అనుకోవాలే కానీ.. అడ్డుకునేదెవరు.
పిల్లల వద్దకు వెళ్లిన ఆయన వారికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అంత పెద్ద మోడీ తమ వద్దకు వచ్చి కరచాలనం చేసేసరికి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిన వారంతా ఒక్కసారిగా మోడీకి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఎగబడ్డారు. ఊహించని ఈ పరిణామానికి మోడీ కింద పడబోయారు. రాబోతున్న ముప్పును గుర్తించిన వ్యక్తిగత సిబ్బంది అలెర్ట్ గా ఉండటంతో.. మోడీ కిందపడే ప్రమాదం నుంచి బయటపడ్డారు.అనంతరం ఆయన తన నివాసానికి బయల్దేరి వెళ్లిపోయారు. వ్యక్తిగత సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించటంతో మోడీ పెద్ద ఇబ్బంది నుంచి బయటపడ్డారు.