Begin typing your search above and press return to search.
మోడీకి ముగ్గురు మంత్రులు కావాలి
By: Tupaki Desk | 18 July 2017 4:27 AM GMTప్రధాని నరేంద్ర మోడీ త్వరలో తన కేబినెట్ ను విస్తరించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో సీనియర్ అయిన వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతిగా వెళ్తుండడం.. ఆ క్రమంలో తాన నిర్వహిస్తున్న శాఖలకు రాజీనామా చేయడంతో కేబినెట్ విస్తరణ అవసరం కనిపిస్తోంది.
వెంకయ్య రాజీనామాతో సమాచార - ప్రసార - పట్టణాభివృద్ధి శాఖలు ఖాళీ అవుతాయి. ఇప్పటికే మనోహర్ పారికర్ గోవా సీఎంగా వెళ్లడంతో రక్షణ శాఖ.. అనిల్ ధవే మరణంతో పర్యావరణ శాఖలు పూర్తి స్థాయి మంత్రి లేకుండా ఉన్నాయి. ఈ రెండు శాఖలను అదనపు బాధ్యతగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ... శాస్త్ర - సాంకేతిక వ్యవహారాల మంత్రి హర్ష్ వర్దన్ లు నిర్వహిస్తున్నారు.
దీంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత ప్రధాని మోడీ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. మోడీ మంత్రివర్గంలో ఈసారి కొందరు కొత్త వారికి అవకాశం లభించవచ్చునని తెలుస్తోంది. గోవా ముఖ్యమంత్రి బాధ్యతలను మనోహర్ పారికర్ చేపట్టడంతో రక్షణ శాఖ - అనిల్ దావే మరణంతో పర్యావరణ మంత్రిత్వ శాఖలకు పూర్తిస్థాయి మంత్రులు లేకుండా పనిచేస్తున్నాయి. ఇప్పుడు వెంకయ్య ఖాళీ చేసిన శాఖలూ కీలకమే. ఈ నేపథ్యంలో కొత్తగా కనీసం ముగ్గురు మంత్రుల అవసరం ఉండడంతో విస్తరణ తప్పక పోవచ్చు.