Begin typing your search above and press return to search.

సౌత్ కు సింగిల్ బెర్తే..

By:  Tupaki Desk   |   5 July 2016 9:32 AM GMT
సౌత్ కు సింగిల్ బెర్తే..
X
మోడీ కేబినెట్ విస్తరణ అనగానే దక్షిణాదిలో చాలామంది నేతలు ఆశలు పెంచుకున్నారు. ముఖ్యంగా ఏపీలో టీడీపీకి చెందిన పలువురు నేతలు దీనికోసం చాలాముందుగానే పైరవీలు కూడా చేసుకున్నారు. కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభును టీడీపీ కోటాలో ఏపీ నుంచి రాజ్యసభకు పంపించినందుకు ప్రతిఫలంగా టీడీపీకి మరో మంత్రి పదవి రావడం గ్యారంటీ అని భావించారు. కానీ.. మోడీ మాత్రం కొత్త తెలుగు నేతలు ఎవరూ లేకుండానే మంత్రివర్గ విస్తరణను ముగించేయడంతో అంతా షాకైపోయారు. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక నుంచి తప్ప కొత్తగా ఎవరికీ ఛాన్సు దొరకలేదు.

మోడీ ఈ విస్తరణలో ఉత్తరాది రాష్ట్రాలైన రాజస్థాన్ - మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు పెద్ద పీట వేశారు. యూపీ - గుజరాత్ - మధ్య ప్రదేశ్ రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున ప్రమాణ స్వీకారం చేశారు. రాజస్థాన్ నుంచి నలుగురిని తీసుకున్నారు. దక్షిణాదిన తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - తమిళనాడు - కర్ణాటక - కేరళ రాష్ట్రాలుండగా - కర్ణాటక నుంచి ఒక్కరికి మాత్రమే మంత్రివర్గంలో స్థానం లభించింది. కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ ఎంపీ రమేష్ చందప్ప జిగజినాగిని తన జట్టులోకి మోదీ తీసుకున్నారు. ఆయన మినహా దక్షిణాది నుంచి స్థానం పొందిన వారెవరూ లేకపోవడం గమనార్హం. బీజేపీకి కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి కూడా ఈ విస్తరణలో స్థానం లభించలేదు.

ఇక తమిళనాడు విషయానికొస్తే అక్కడ కన్యాకుమారి నుంచి మాత్రమే బీజేపీ ఎంపీగా పొన్ రాధాకృష్ణన్ ఉన్నారు. ఆయన ఇప్పటికే కేంద్ర మంత్రి. అలాగే తెలంగాణలో బండారు దత్తాత్రేయ కేంద్రంలో ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. తెలంగాణలో టీడీపీ నుంచి గెలిచిన మల్లారెడ్డి టీఆరెస్ లో చేరడంతో ఆ ఛాన్సు లేదు. కేరళలో అసలు బీజేసీకి ఎమ్మెల్యేలే లేరు. కర్ణాటక - ఏపీలో మాత్రమే బీజేపీకి ఎంపీలు ఉన్నారు. ఏపీలో బీజేపీతో పాటు - టీడీపీ ఎంపీలు ఉన్నారు. కర్ణాటకలో బీజేపికి పెద్ద సంఖ్యలో ఎంపీలున్నారు. వీరిలో కేవలం కర్ణాటకకు చెందిన రమేశ్ కు మాత్రం ఛాన్సు దొరికింది. ఏపీలోని బీజేపీ - టీడీపీ ఎంపీలకు నిరాశమే మిగిలింది.

కొత్త మంత్రులు వీరే..

ఎస్‌ ఎస్‌ ఆహ్లువాలియా - సహాయమంత్రి (పశ్చిమబెంగాల్‌)

ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే - సహాయ మంత్రి (మండ్లా - మధ్యప్రదేశ్‌)

రమేష్‌ చందప్ప జిగజినాగి - సహాయ మంత్రి (బీజాపూర్‌ - కర్ణాటక)

విజయ్‌ గోయల్‌ - సహాయ మంత్రి (రాజస్థాన్‌)

రామ్‌ దాస్‌ అథవలే - సహాయ మంత్రి (రాజ్యసభ - మహారాష్ట్ర)

రాజెన్‌ గొహేన్‌ - సహాయ మంత్రి (నాగావ్‌ - అసోం)

అనిల్‌ మాధవ్‌ దవే - సహాయ మంత్రి (రాజ్యసభ - మధ్యప్రదేశ్‌)

పురుషోత్తమ్‌ రూపాలా - సహాయ మంత్రి (రాజ్యసభ - గుజరాత్‌)

ఎంజే అక్బర్‌ - సహాయ మంత్రి (రాజ్యసభ - ఝార్ఖండ్‌)

అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ - సహాయ మంత్రి (బికనీర్‌ - రాజస్థాన్‌)

జశ్వంత్‌ సిన్హ్‌ భాభోర్‌ - సహాయమంత్రి (దాహోద్‌ - గుజరాత్‌)

మహేంద్రనాథ్‌ పాండే - సహాయమంత్రి (చందౌలీ - ఉత్తరప్రదేశ్‌)

అజయ్‌ టంటా - సహాయమంత్రి (అల్మోరా - ఉత్తరాఖండ్‌)

కృష్ణారాజ్‌ - సహాయమంత్రి (షాజహాన్‌ పూర్‌ - ఉత్తరప్రదేశ్‌)

మన్సుఖ్‌ భాయ్‌ మందావియా - సహాయమంత్రి (రాజ్యసభ - గుజరాత్‌)

అనుప్రియపటేల్‌ - సహాయమంత్రి (మిర్జాపూర్‌ - ఉత్తరప్రదేశ్‌)

సీఆర్‌ చౌదరి - సహాయమంత్రి ( నాగౌర్‌ - రాజస్థాన్‌)

పీపీ చౌదరి - సహాయమంత్రి (పాలి - రాజస్థాన్‌)

శుభాష్‌ రామ్‌ రావ్‌ భామ్రే - సహాయమంత్రి (ధూలే - మహారాష్ట్ర)