Begin typing your search above and press return to search.

కొన్ని వారాల్లో వ్యాక్సిన్.. ధర ఖరారు: మోడీ కీలక ప్రకటన

By:  Tupaki Desk   |   4 Dec 2020 2:36 PM GMT
కొన్ని వారాల్లో వ్యాక్సిన్.. ధర ఖరారు: మోడీ కీలక ప్రకటన
X
అందరూ ఎదురుచూస్తున్న రోజు రాబోతోంది. కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్ రాబోతోంది. మరికొన్ని వారాల్లోనే భారత్ లో కరోనా వైరస్ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తేనున్నట్టు భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. ఈరోజు అఖిలపక్ష భేటిలో ఆయన ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.

వ్యాక్సిన్ తయారీలో మన శాస్త్రవేత్తలు ధీమాగా ఉన్నారని.. అత్యంత చవకైన, అలాగే సురక్షితమైన కరోనా వ్యాక్సిన్ మీద ప్రపంచమంతా దృష్టిపెట్టిందని..అందరూ భారత్ వైపు ఆశగా చూస్తున్నారని మోడీ చెప్పుకొచ్చారు. మన శాస్త్రవేత్తలు సరే అన్న వెంటనే ఇండియాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు.

ముందుగా ఈ వ్యాక్సిన్ ను కరోనా వారియర్స్ కు.. సీనియర్ సిటిజన్స్ కు మాత్రమే ఇస్తామని మోడీ ప్రకటించారు. ఆ తర్వాత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు.

ఇక కరోనా వ్యాక్సిన్ కు ధర కూడా నిర్ణయిస్తామని.. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఒక నిర్ణయానికి వచ్చి దీని ధరను ఫిక్స్ చేస్తామని మోడీ పేర్కొన్నారు. అందుబాటులోకి వచ్చిన వెంటనే ఎలా పంపిణీ చేయాలనే దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయని తెలిపారు.