Begin typing your search above and press return to search.
మోదీ కామెంట్: దేశానికి ముందస్తు దివాలీ
By: Tupaki Desk | 7 Oct 2017 10:40 AM GMTప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశప్రజలకు ముందస్తు గానే దీపావళి పండుగ వచ్చిందని చెప్పారు. నిన్న జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో సామాన్యులకు, మధ్య తరగతి వర్గానికి పెద్ద ఊరట లభించిందని పేర్కొన్న ఆయన దీనిని దీపావళిగా అభివర్ణించారు. జీఎస్టీ విషయంలో తాము గతంలోనే ఓ మాట చెప్పామని, రాబోయే మూడు మాసాల్లో దీనిపై అధ్యయనం చేసి, లోటు పాట్లు సవరించుకుంటామని, మార్పులు చేర్పులు ఉంటాయని అప్పట్లోనే వివరించామని ప్రధాని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే నిన్న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
మొత్తంగా 27 వస్తువులపై జీఎస్టీలో మార్పులు చేశారు. ఫలితంగా నిత్యం వినియోగించే వస్తువుల ధరలు దిగిరానున్నాయి. నూలు - గృహ నిర్మాణాలకు వినియోగించే వస్తువులు - డీజిల్ ఇంజన్ స్పేర్ పార్ట్స్ సహా పలు వస్తువుల ధరలు తగ్గనున్నాయి. కాగా, ఓఖా-ద్వారకల మధ్య నిర్మించ తలపెట్టిన వంతెనకు ప్రధాని మోదీ శంకు స్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. దేశానికి మంచి చేయాలనే తలంపుతో తీసుకునే నిర్ణయాలకు ప్రజల నుంచి మద్దతు ఉంటుందని చెప్పారు. అభివృద్ధి ఫలాలను అందుకోవాలని దేశంలోని ప్రతి సాధారణ పౌరుడు - పౌరురాలు ఎదురు చూస్తున్నారని తెలిపారు.
ఏ ఒక్కరూ తమ పిల్లలు పేదరికంలోనే మగ్గాలని కోరుకోవడం లేదని, అందుకే తమ ప్రభుత్వం ప్రజల కలలు నెరవేర్చేందుకు పేదరికంతో యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. రెండు పర్యటన నిమిత్తం గుజరాత్ చేరుకున్న ప్రధాని.. శనివారం జాం నగర్ చేరుకున్నారు. తొలిగా ఆయన ద్వారకానాథ్ ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం రాజ్ కోట్ కు వెళ్లారు. అక్కడ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా అహ్మదాబాద్-రాజ్ కోట్ ల మధ్య ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. అలాగే.. పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.