Begin typing your search above and press return to search.

చెప్పులు మోసినా సీఎంకు నో టికెట్: మోడీ

By:  Tupaki Desk   |   30 March 2021 4:54 PM GMT
చెప్పులు మోసినా సీఎంకు నో టికెట్: మోడీ
X
ప్రధాని నరేంద్రమోడీ చెలరేగిపోయాయి. మరోసారి నిప్పులు చెరిగారు. నరేంద్రమోడీ ప్రస్తుతం దక్షిణాదిలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మూడు ఎన్నికల రాష్ట్రాల్లో వరుసగా భారీ సభల్లో పాల్గొన్నారు.తొలుత కేరళలోని పాలక్కడ్ లో , ఆ తర్వాత తమిళనాడులోని ధారపురంలో.. చివరగా పుదుచ్చేరిలో బీజేపీ తరుఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలి రెండు సభల మాదిరిగానే పుదుచ్చేరిలోనూ ప్రత్యర్థులపై మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

గడిచిన కొన్నేళ్లుగా కాంగ్రెస్ పాలనలో కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి పూర్తిగా ఆగమైపోయిందని.. అన్ని రంగాల్లోనూ కాంగ్రెస్ సర్కారు విఫలమైందని.. చివరకు సిట్టింగ్ సీఎం నారాయణ స్వామికి టికెట్ నిరాకరించడం కాంగ్రెస్ ఘోర వైఫల్యానికి మచ్చుతునక అని ప్రధాని మోడీ వవిమర్శించారు.కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీఎంకు పోటీచేసే అవకాశం ఇవ్వకపోవడంతో ఈసారి ఎన్నికలు ప్రత్యేకమైనవిగా మారాయన్నారు.

పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి ఆది నుంచి కాంగ్రెస్ వాదిగా విధేయంగా ఉన్నారని.. కాంగ్రెస్ అధినేత చెప్పులను మోశారని.. రాహుల్ ను ఆకట్టుకునేందుకు తప్పుడు అనువాదాలు చేశారని.. పాపం ఇన్ని చేసినా నారాయణ స్వామికి కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీచేసేందుకు టికెట్ ఇవ్వకపోవడం దారుణమని మోడీ ఎద్దేవా చేశారు.నారాయణ స్వామిని పోటీ నుంచి పక్కకు తప్పించడాన్ని బట్టి పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం సృష్టించిందని స్పష్టంగా అర్తమవుతోందన్నారు.

పుదుచ్చేరి సహా అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్న తమిళనాడు, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్డీఏ హవా కనిపిస్తోందని.. తాను పాల్గొన్న సభలన్నింటినీ ప్రజలు విజయవంతం చేశారని.. అన్ని చోట్లా ఎన్డీఏ కూటములు విజయం సాధిస్తాయన్న నమ్మకం ఏర్పడిందని ప్రధాని మోడీ చెప్పారు.