Begin typing your search above and press return to search.
దశాబ్దపు తొలి ఎన్నికలు...మోదీది అసందర్భ వ్యాఖ్యేనా?
By: Tupaki Desk | 5 Feb 2020 1:30 AM GMTదేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ప్రచారం హోరెత్తుతోంది. ఓ వైపు సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఓ రేంజిలో దూసుకుపోతూ ఉంటే... ఈసారైనా ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాల్సిందేనన్న రీతిలో బీజేపీ కూడా తన ప్రచారాన్ని ఓ రేంజిలో ఊపేస్తోంది. ఈ క్రమంలో సోమవారం ప్రచారంలో పాలుపంచుకున్న మోదీ... మంగళవారం కూడా ప్రచారంలో బిజీబిజీగా గడిపారు. ఈ సందర్భంగా మోదీ నోట నుంచి వచ్చిన ఓ కామెంట్ అమితాసక్తిని రేకెత్తిస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఈ దశాబ్దపు తొలి ఎన్నికలుగా అభివర్ణించిన మోదీ... ఈ ఎన్నికల్లో ఢిల్లీ ఓటర్లు తీసుకునే నిర్ణయంపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించారు.
మోదీ నోట నుంచి వచ్చిన ఈ అరుదైన వ్యాఖ్యలో తప్పేముందంటారా? అయితే అసలు కథలోకి వెళ్లిపోదాం పదండి. కాంగ్రెస్ పార్టీ దివంగత నేత షీలా దీక్షిత్ కంటే ముందు అప్పుడెప్పుడో బీజేపీ ఢిల్లీలో అధికారం చెలాయించింది. ఆ తర్వాత షీలా వరుసగా 15 ఏళ్ల పాటు ఢిల్లీ సీఎంగా కొనసాగితే.. ఇప్పుడు ఏడేళ్లుగా (మధ్యలో ఓ ఏడాది మినహా) కేజ్రీనే సీఎంగా కొనసాగుతున్నారు. షీలా దీక్షిత్ ను ఓడించేసిన కేజ్రీ... వరుసగా రెండు సార్లు సీఎం పోస్టును చేజిక్కించుకున్నారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లోనూ ఆప్ దే విజయమని - మళ్లీ కేజ్రీనే సీఎం అని దాదాపుగా అన్ని సర్వేలు కోడై కూస్తున్నాయి.
అంటే... ఈ ఎన్నికల్లో కూడా ఆప్ కే విజయావకాశాలు ఉన్నాయని చెప్పాలి. బీజేపీ హోరాహోరీగా పోరాడుతున్నా కూడా ఆ పార్టీ గెలుపు దాదాపుగా దుస్సాధ్యమేనని సర్వేలు చెబుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ దశాబ్దపు తొలి ఎన్నికలో బోణీ కొట్టేసి... భవిష్యత్తులోనూ విజయఢంకా మోగించాలని పార్టీ శ్రేణులకు మోదీ పిలుపునిచ్చారు. అంతేకాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీకే ఓటేయాలని కూడా మోదీ ఢిల్లీ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తే ఓకే గానీ... సర్వేలు చెప్పినట్లుగా ఫలితాల్లో బీజేపీ గల్లంతైతే... దశాబ్దపు తొలి ఎన్నికల్లోనే ఓటమి పాలైన బీజేపీ... ఇక ఆపై వచ్చే అన్ని ఎన్నికల్లోనూ ఓటమిపాలవుతుందన్న వాదనలు వినిపిస్తాయి. మరి ఈ విషయంపై స్పష్టత ఉండే మోదీ ఈ మాట అన్నారా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.