Begin typing your search above and press return to search.
త్రిపుర ప్రచారంలో ఏపీ ప్రస్తావన తెచ్చిన మోడీ!
By: Tupaki Desk | 9 April 2019 10:43 AM ISTపశ్చిమబెంగాల్ - త్రిపురల్లో ఎన్నికల ప్రచారం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏపీ ప్రస్తావన తీసుకురావడం ఆసక్తిదాయకంగా ఉంది. రాహుల్ గాంధీని పై విమర్శలు చేస్తూ ఏపీ ప్రస్తావన తీసుకొచ్చారు నరేంద్రమోడీ. రాహుల్ గాంధీ కేరళ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ అంశం గురించి మోడీ ప్రస్తావించారు.
దక్షిణాదిలో పోటీ చేయాలన్న రాహుల్ గాంధీ కేరళనే ఎందుకు ఎంచుకున్నారని, ఆయన కర్ణాటకలోనో, ఏపీలోనో ఎందుకు పోటీ చేయడం లేదు? అని నరేంద్రమోడీ ప్రశ్నించారు. కర్ణాటకలోనో - ఏపీలోనో పోటీ చేయడానికి రాహుల్ ఎందుకు వెనుకడుగు వేశారు? అని మోడీ అన్నారు.
‘రాహుల్ ఎందుకు ఏపీలో పోటీ చేయలేదు? పాండిచ్చేరి - కర్ణాటకల నుంచి పోటీ చేయొచ్చుగా, మరీ అంతగా కావాలనుకుంటే ఏపీ నుంచి పోటీ చేయవచ్చు కదా. అక్కడ యూటర్న్ బాబుతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలిపింది కదా..’ అని మోడీ వ్యాఖ్యానించారు.
మోడీ ప్రశ్నకు రాహుల్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు కానీ.. ఆ ప్రశ్నకు సామాన్యులకు మాత్రం సమాధానం ఈజీగా దొరుకుతుంది.
కర్ణాటకలో బీజేపీ గట్టిగా ఉంది. అధికారం కాంగ్రెస్- జేడీఎస్ చేతుల్లో ఉన్నా.. అక్కడ బీజేపీ గట్టి పోటీ దారే. కాబట్టి అక్కడ పోటీకి రాహుల్ వెళ్లలేదు. ఇక ఏపీలో కాంగ్రెస్ జాడే లేదు. ఒకవేళ తెలుగుదేశం- కాంగ్రెస్ లు
అధికారికంగా పొత్తు పెట్టుకుని పోటీ చేసి ఉన్నా.. ఆ పార్టీ బలం మీద రాహుల్ ఆధారపడ్డాడు అనే విమర్శ వస్తుంది కాబట్టి, రాహుల్ తమకు కొద్దో గొప్పో అనుకూలత ఉన్న కేరళ నుంచి, మైనారిటీలు గట్టిగా ఉన్న వయనాడ్ నుంచి పోటీకి దిగారనేది అందరికీ అర్థం అవుతున్న విషయమే!