Begin typing your search above and press return to search.
రాజీవ్ అవినీతి సామ్రాట్ గానే చనిపోయాడు..
By: Tupaki Desk | 5 May 2019 11:48 AM GMTకొద్దిరోజులుగా ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి ఎన్నికల ప్రచార సభల్లో ‘చౌకీదార్ చోర్’ అంటూ అవినీతి ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీకి దిమ్మదిరిగేలా ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ కౌంటర్లు ఇచ్చారు. మొత్తానికి నాలుగోవిడత పూర్తయ్యాక రాహుల్ ను టార్గెట్ చేయడం మోడీ మొదలుపెట్టాడు. రాహుల్ తోవలోనే కడిగిపారేశాడు.
ఉత్తరప్రదేశ్ లోని ఓ ర్యాలీలో పాల్గొన్న మోడీ మాజీ ప్రధానమంత్రి, రాహుల్ తండ్రి అయిన రాజీవ్ గాంధీ గురించి సంచలన ఆరోపణలు చేశారు. రాజీవ్ గాంధీ జీవితం అంతా అవినీతి ఆరోపణలతో సాగిందని.. ఆయన అవినీతిలో నంబర్ 1 నాయకుడు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక రాహుల్ ఆరోపిస్తున్న రాఫెల్ కుంభకోణంపై కూడా మోడీ తొలిసారి స్పందించారు. రాహుల్ తన ప్రతిష్టను దిగజార్చేందుకు ఇలాంటి అంశాన్ని ఎంచుకున్నారని మండిపడ్డారు.
రాజీవ్ గాంధీ పాలన అంతా అవినీతి మయమేనని.. భోఫోర్స్ కుంభకోణంలో రాజీవ్ గాంధీ నిండా మునిగాడని.. ఆయన మిస్టర్ క్లీన్ ఇమేజ్ ఎప్పుడూ లేదని మోడీ ఆరోపించారు. భ్రష్టాచారి నంబర్ 1 అంటూ సెటైర్ వేశారు. కాంగ్రెస్ నా ప్రతిష్టను దెబ్బతీసి.. తనను తక్కువ చేసి చూపేందుకు ఇలా చేస్తోందని.. దేశంలో బలహీన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ కోరుకుంటోదని మోడీ విమర్శించారు.
తాను బంగారు పల్లెంలో పుట్టలేదని.. అలాగే పెద్ద కుటుంబంలో కూడా పుట్టలేదని రాహుల్ గాంధీ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని మోడీ సూచించారు. కాంగ్రెస్ నాయకత్వం అంతా అలానే పుట్టారని ఎద్దేవా చేశారు..
కాగా మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. 1991లో దేశం కోసం మరణించిన రాజీవ్ గాంధీ మీద ఆరోపణలు చేస్తారా అని మోడీపై విమర్శలు కురిపించారు.