Begin typing your search above and press return to search.

మోడీజీ.. పార్టీ ఆర్మీకి ఈ మాట చెప్పండి!

By:  Tupaki Desk   |   30 Aug 2018 7:54 AM GMT
మోడీజీ.. పార్టీ ఆర్మీకి ఈ మాట చెప్పండి!
X
నీతులు చెప్పే నేత‌లకు ఈ దేశంలో కొద‌వ‌లేదు. అయితే.. వ్య‌క్తిత్వ వికాస నిపుణుడిలా.. మ‌న‌సు దోచేలా మాట‌లు చెప్ప‌టంలో ప్ర‌ధాని మోడీ త‌ర్వాతే ఎవ‌రైనా. ఆయ‌న మాట‌ల‌కు ఫిదా కాని వారెవ్వ‌రూ ఉండ‌రు. అయితే.. షుగ‌ర్ కోటెడ్ మందుబిళ్ల‌లో షుగ‌ర్ ఎంత మాత్రంగా ఉంటుందో.. వ్య‌క్తిత్వ వికాస నిపుణుడిలా మాట్లాడే మోడీ మాట‌ల్లో ప‌స ఎంత‌న్న‌ది గ‌డిచిన నాలుగున్న‌రేళ్ల‌లో దేశ ప్ర‌జ‌ల‌కు బాగానే అర్థ‌మైంది.

తాను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిన ప్ర‌తిసారీ.. త‌న‌పై ఎదురుదాడి ముమ్మ‌ర‌మైన ప్ర‌తి సంద‌ర్భంలోనూ నీతులు చెప్పే ప‌నిని షురూ చేసే మోడీ.. తాజాగా మ‌ళ్లీ అదే ప‌ని షురూ చేశారు. సోష‌ల్ మీడియాను బుర‌ద చ‌ల్ల‌టానికి ఉప‌యోగించొద్ద‌ని దేశ ప్ర‌జ‌ల‌ను కోర‌టం గ‌మ‌నార్హం. సోష‌ల్ మీడియాలో స‌మాజాన్ని బ‌లోపేతం చేసే స‌మాచారాన్ని పంచుకోవాలే కానీ.. బుర‌ద జ‌ల్ల‌టానికి ఉప‌యోగ‌ప‌డేలా వ్య‌వ‌హ‌రించ‌కూడ‌ద‌న్న మాట‌ను ఆయ‌న చెబుతున్నారు.

ఒక్కోసారి ప్ర‌జ‌లు ఔచిత్ం కోల్పోతార‌ని.. హ‌ద్దు మీర‌తార‌ని.. నిజం కానిదేదో విని లేదంటే చూసి దాన్ని ఫార్వ‌ర్డ్ చేస్తాన‌ని.. దీని కార‌ణంగా స‌మాజానికి ఎంత చేటు క‌లుగుతుందో అర్థం చేసుకోర‌న్నారు. స‌భ్య స‌మాజం విన‌లేని ప‌ద‌జాలాన్ని.. మ‌హిళ‌ల గురించి ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడి రాసేస్తారంటూ నీతులు చెప్పే ప్రోగాం షురూ చేశారు. మోడీ నిజంగానే మార్పు కోరుకుంటే మొద‌ట 125 కోట్ల మందికి మాట‌లు చెప్ప‌టం మానేసి.. సంస్క‌ర‌ణ త‌న నుంచి షురూ చేయాలి.

త‌న స‌ర్కారు మీద అవిశ్వాసం పెట్టి.. దానిపై చ‌ర్చ జ‌రుగుతున్న‌ప్పుడు విప‌క్షానికి చెందిన రాహుల్ త‌న‌ను ఆత్మీయంగా హ‌త్తుకుంటే.. ఆ విష‌యాన్ని ఎంత‌లా రాజ‌కీయం చేసింది తెలిసిందే. ఒక‌వేళ రాహుల్ రాజ‌కీయ ప్ర‌యోజ‌నం కోసం గేమ్ ఆడార‌నే అనుకుందాం. హుంద‌గా ఒక్క‌మాట అని ఉంటే స‌రిపోయేది క‌దా? కానీ.. అదే ప‌నిగా రాహుల్ పై ఎట‌కారం చేసుకోవ‌టం మీద‌నే దృష్టి పెట్టారు. లోక్ స‌భ సాక్షిగా రాహుల్ ను ఎంత‌లా ఎట‌కారం చేసింది అంద‌రూ చూశారు. త‌న‌పై ఒక్క మెట్టు అధిక్య‌త సాధించిన‌ట్లు క‌నిపించ‌గానే మోడీలో మ‌రో మ‌నిషి బ‌య‌ట‌కు వ‌చ్చిన వైనాన్ని ఆయ‌న ఎందుకు ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకోరు?

సోష‌ల్ మీడియాను అలా వాడండి.. ఇలా వాడండి అని బోధ చేసే ముందు కాషాయ ఆర్మీకి.. బీజేపీ ఆర్మీకి స్ప‌స్ట‌మైన ఆదేశాలు ఇచ్చే గొడ‌వ‌లు చాలావ‌ర‌కూ త‌గ్గిపోతాయి క‌దా? పార్టీ భావ‌జాలాన్ని.. త‌న రాజ‌కీయ వ్యూహాల్ని అమ‌లు చేయ‌టానికి సోష‌ల్ మీడియా విభాగాల్ని ఏర్పాటు చేసి మ‌రీ ప్ర‌చారం చేసే మోడీ మాష్టారు.. ముందు వాటిని కంట్రోల్ చేసిన త‌ర్వాత దేశ ప్ర‌జ‌ల‌కు నీతులు చెబితే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.