Begin typing your search above and press return to search.

కేబినెట్ లోకి పురంధేశ్వరి.. మోడీ కండీషన్ ఇదే?

By:  Tupaki Desk   |   27 Oct 2019 9:29 AM GMT
కేబినెట్ లోకి పురంధేశ్వరి.. మోడీ కండీషన్ ఇదే?
X
కేంద్ర మంత్రివర్గ విస్తరణకు మోడీ మొగ్గు చూపుతున్నట్టు ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాలకు ఒక కేంద్రమంత్రిని ఇచ్చిన ప్రధాని నరేంద్రమోడీ ఏపీ విషయంలో మాత్రం ఆ భాగ్యం ఎవ్వరికీ కలిగించలేదు. ఈ నేపథ్యంలోనే కేంద్రం తరుఫున ఏపీలో వ్యవహారాలను , కేంద్ర అభివృద్ధి పథకాలను ప్రారంభించే, పనులు చేయించేవారే లేకుండా పోయారు.

ఈ క్రమంలోనే ఏపీకి కేంద్రమంత్రిని ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. అయితే ప్రధానంగా ఈ కేంద్రమంత్రి పదవికి జీవీఎల్ నరసింహారావు, సుజనా చౌదరి, పురంధేశ్వరిలు పోటీపడుతున్నారు. అయితే జీవీఎల్, సుజనాకు బీజేపీలో అంతటి ఫాలోయింగ్ - సామాజిక మద్దతు తక్కువ. అదే పురంధేశ్వరికి బలమైన కమ్మ సామాజికవర్గం అండ ఉంటుంది. టీడీపీ నుంచి నేతలు బీజేపీలోకి పెద్ద ఎత్తున రావడానికి ఆస్కారం కలుగుతుంది. ఆ కోణంలోనే బీజేపీ పురంధేశ్వరికి కేంద్రమంత్రి పదవి ఇచ్చేందుకు రెడీ అయ్యిందన్న ప్రచారం సాగుతోంది.

వీరిలో పురంధేశ్వరికే ఎక్కువ చాన్స్ ఉన్నట్టు ఢిల్లీ వర్గాల సమాచారం. అయితే పురంధేశ్వరికి కొన్ని కండీషన్లు పెట్టినట్టు ఢిల్లీ వర్గాల సమాచారం. పురంధేశ్వరి బీజేపీలో ఉంటూ ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు - ఆమె కుమారుడు హితేష్ లు వైసీపీలో ఉండడం వివాదాస్పదమవుతోంది. ఈ రెండు పార్టీలు బీటీం అని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ ఇలా ఉండవద్దని.. ఇబ్బందులు ఎదురవుతాయని.. అయితే వైసీపీ లేదా బీజేపీలో ఒకే పార్టీలో ఉండాలని దగ్గుబాటికి అల్టీమేటం జారీ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు బీజేపీ కూడా ఇదే కండీషన్ పెట్టినట్టు సమాచారం.

దగ్గుబాటి వెంకటేశ్వరరావు - హితేష్ లు కూడా బీజేపీలోకి వస్తే పురంధేశ్వరికి కేంద్రమంత్రి బెర్త్ దక్కడం సులువు అన్న విశ్లేషణలు సాగుతున్నాయి. మరి ఈ విషయంలో పురంధేశ్వరి ఫ్యామిలీ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది వేచిచూడాల్సిందే.