Begin typing your search above and press return to search.
మోడీ గెలవకపోతే దేశానికే ప్రమాదమన్న నటి!
By: Tupaki Desk | 30 March 2019 1:07 PM GMTమోడీ దేశానికి మళ్లీ ప్రధాని కాకపోతే యావత్ దేశానికే ప్రమాదం ముంచుకువచ్చినట్టే అని అంటున్నారు బీజేపీ ఎంపీ హేమమాలిని! మధుర నియోజకవర్గం నుంచి మళ్లీ కమలం పార్టీ టికెట్ మీద పోటీ చేస్తున్న ఈ అలనాటి డ్రీమ్ గర్ల్.. ప్రచారంలో భాగంగా ఈ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మోడీ మళ్లీ ప్రధాని కాకపోతే దేశానికే ప్రమాదం అని ఈమె వ్యాఖ్యానించడం ఒకింత వివాదాస్పదం అవుతోంది కూడా.
మోడీని, తనను, బీజేపీని మళ్లీ గెలిపించాలని హేమమాలిని కోరితే కోరవచ్చు. అయితే మోడీ గెలవకపోతే దేశానికే ప్రమాదం అని ఈమె వ్యాఖ్యానించడం మాత్రం ఒకింత తీవ్రంగానే ఉంది. ఈ విషయంలో ప్రతిపక్షాల వాళ్లు ఫైర్ కావొచ్చు.
దేశానికి మోడీ ప్రధానమంత్రే కానీ.. మోడీ ఆ సీట్లో లేకపోతే దేశానికే ప్రమాదం అనడం మాత్రం అనుచితం. ఎందుకంటే.. మోడీ ప్రధాని పీఠంలో కూర్చుకపోయినా దేశం అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొని నిలబడింది. మోడీ ప్రధాని కాకముందు కూడా భారత దేశంలో చాలా ప్రగతి సాధించింది. అంతా మోడీ మయం అనడం మాత్రం టూమచ్.
ఎంతైనా బీజేపీ నేత కాబట్టి అలా మాట్లాడి ఉండవచ్చు. మరోవైపు మధురలో హేమమాలిని మళ్లీ గెలుస్తుందా? అనేది ఆసక్తిదాయకమైన అంశం అవుతోంది. గత ఎన్నికల్లో ఈమె సూపర్ మెజారిటీని సాధించారు. మూడు లక్షల ముప్పై వేలకు పైగా మెజారిటీని సాధించారు హేమమాలిని. అది భారీ మెజారిటీ అని వేరే చెప్పనక్కర్లేదు.
అయితే ఆ తర్వాత ఈమె పని తీరుపై విమర్శలు వచ్చాయి. స్థానికంగా ఈమె అందుబాటులో ఉండరనే విమర్శలు వచ్చాయి. తమ ఎంపీ హేమమాలిని కనిపించడం లేదని మధురలో పోస్టర్లు కూడా వెలిశాయి. అయినా ఈ సారి ఆమెకే టికెట్ కేటాయించింది బీజేపీ. ఇవే తను పోటీ చేసే చివరి ఎన్నికలు అని కూడా ఈ డ్రీమ్ గర్ల్ ప్రకటించేశారు. ఇక ఈమె విషయంలో మధుర ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి!