Begin typing your search above and press return to search.
నిన్న లోక్ సభలో.. నేడు రాజ్య సభలో.. ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పై మోదీ ఫైర్
By: Tupaki Desk | 8 Feb 2022 9:42 AM GMTఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, యూపీ అసెంబ్లీ ఎన్నికలో.. మరేదైనా కారణమో కానీ.. ప్రధాని మోదీ వరుసగా రెండో రోజూ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. పార్లమెంటులో ఆ పార్టీని టార్గెట్ చేసుకుంటూ రెచ్చిపోయారు. సోమవారం లోక్ సభలో మాట్లాడుతూ.. కొవిడ్ వ్యాప్తి, లాక్ డౌన్ లో వలస కార్మికుల కష్టాలకు కాంగ్రెస్సే కారణమని, ఓడిపోయినా బుద్ధి రాలేదంటూ మంటూ ఫైర్ అయిన మోదీ.. మంగళవారం రాజ్యసభలో అంతే స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చినట్లు చెప్పుకున్నా అక్కడి ప్రజలు ఆదరించలేదంటూ కాంగ్రెస్ ను నిన్న దెప్పిపొడిచిన మోదీ..నేడు మరిన్ని వాగ్బాణాలు విసిరారు. కాంగ్రెస్ హయాంలో చోటుచేసుకున్న ఎమర్జెన్సీ విధింపు, సిక్కుల ఊచకోత వంటి సున్నిత అంశాలను ప్రస్తావిస్తూ మరీ ధ్వజమెత్తారు.
ఉరుము లేని పిడుగులా?
అసలు నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్ ను లక్ష్య పెట్టనట్టు కనిపించిన మోదీ ఉన్నట్టుంది ఆ పార్టీని టార్గెట్ చేయడమేమిటి? దీనికి కారణాలేమిటి? అని అనుమానాలు వస్తున్నాయి. ఏ సందర్బం లేకుండానూ పని తలపెట్టని మోదీ.. అకస్మాత్తుగా ఇలా వ్యవహరించడం అందరినీ ఆశ్చర్యపర్చింది కూడా. అదీ.. లోక్ సభ, రాజ్య సభ రెండింటిలోనూ కాంగ్రెస్ ను దునుమాడడం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది.
బడ్జెట్ వైఫల్యం నుంచి తప్పించుకునేందుకా?
ఇటీవలి కేంద్ర బడ్జెట్ అట్టర్ ఫ్లాప్. సామాన్యుల్లో ఎవరికీ ఏమీ చేయని ఈ బడ్జెట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ దుమ్మెత్తిపోశారు. మిగతా సీఎంల సంగతి సరేసరి. ప్రజల్లో కేంద్ర బడ్జెట్ పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ఏ వర్గానికి ప్రయోజనం చేకూరిందో చెప్పలేని పరిస్థితుల్లో ప్రజలంతా మండిపడుతున్నారు. ఇదీ ఒక బడ్జెటేనా? అనే ఈసడింపులు వచ్చాయి. దీనిని గమనించే, విషయాన్ని పక్కదారి పట్టించేలా మోదీ కాంగ్రెస్ ను పట్టుకుని విమర్శలు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలే కారణమా?
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్ లో కాంగ్రెస్ బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి. యూపీలో సమాజ్ వాదీ ప్రధాన ప్రత్యర్థి అయినప్పటికీ ప్రియాంక గాంధీ కారణంగా అక్కడా కాంగ్రెస్ అంతోఇంతో చెప్పుకోదగ్గ రీతిలో ఉంది. దీనిని మనసులో పెట్టుకునే మోదీ పార్లమెంటు వేదికగా కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. వాస్గవానికి మోదీకి ఇలాంటి ట్రిక్ప్ కొత్తకాదు. బెంగాల్ ఎన్నికలకు రవీంద్ర నాథ్ ఠాగూర్ లా గడ్డం పెంచి.. ఎన్నికలు ముగిసిన వెంటనే గడ్డం ట్రిమ్ చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇటీవల పంజాబీ పగిడీ, మణిపురీ టోపీ ధరించి వార్తల్లో నిలిచారు. ఈ నేపథ్యంలోనే మోదీ తాజా వ్యాఖ్యలు చోటుచేసుకున్నట్టు కనిపిస్తోంది.
కరోనా.. ఎమర్జెన్సీ.. పండిట్లు.. సిక్కుల ఊచకోత.. తెలంగాణ
మోదీ మంగళవారం నాటి రాజ్య సభ ప్రసంగంలో సిక్కుల ఊచకోతను ప్రస్తావించారు. 1984లో ఇందిరా గాంధీ హత్యానంతరం చెలరేగిన అల్లర్లలో సిక్కులు ఊచకోతకు గురయ్యారు. ఇప్పుడు పంజాబ్ ఎన్నికల ముంగింట మోదీ దీనిని రాజ్య సభలో ప్రస్తావించారు. ‘కాంగ్రెస్ లేకపోతే ఏం జరిగేదో తెలుసా.. అని కొందరు సభ్యులు అడుగుతున్నారు.. వాళ్లకి నేను చెప్పాలనుకున్నది ఒక్కటే.. కాంగ్రెస్సే లేకపోతే ఎమర్జెన్సీ ఉండేదే కాదు.. సిక్కుల ఊచకోత జరిగేది కాదు.. కులతత్వ రాజకీయాలు, కశ్మీర్ పండిట్ల సమస్యలూ వచ్చేవే కావు’ అంటూ వ్యాఖ్యానించారు. ఇందులో పండిట్ల గురించీ చెప్పడం గమనార్హం.
ఉత్తరాఖండ్, యూపీల్లో పండిట్లూ పెద్ద సంఖ్యలో ఉన్నారు. మొత్తమీద పార్లమెంటు ఉభయ సభల్లోనూ మోదీ వ్యూహాత్మకంగా రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్నీ ప్రధాని ప్రస్తావించారు. ‘తెలంగాణ ఏర్పాటుకు మేం వ్యతిరేకం కాదు. వాజ్‌పేయీ ప్రభుత్వం కూడా 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. శాంతియుతంగా అందరూ కలిసి కూర్చుని, చర్చించి బిల్లులను పాస్ చేశారు. కానీ ఏపీ, తెలంగాణ విషయంలో అలా జరగలేదు. నాడు కాంగ్రెస్ హయాంలో మైకులు ఆపేశారు. కాంగ్రెస్ సభ్యులు పెప్పర్ స్ప్రే కొట్టారు. ఎలాంటి చర్చ లేకుండా ఏపీని విభజించారు. విభజన తీరుతో ఏపీ, తెలంగాణ ఇప్పటికీ నష్టపోతున్నాయి. కాంగ్రెస్ అహంకారం, అధికార కాంక్షకు ఇదే నిదర్శనం. ఏపీ విభజన తీరు సరిగ్గా లేదు. సరిగ్గా విభజన జరిగి ఉంటే రెండు రాష్ట్రాలకు సమస్యలు వచ్చేవి కావు’’ అని మోదీ
కాంగ్రెస్‌ను దుయ్యబట్టారు. చూద్దాం మరి దీనికి కాంగ్రెస్ దీటుగా స్పందిస్తుందో..? లేదా మౌనంగా నిందలు భరిస్తుందో?