Begin typing your search above and press return to search.
పరోక్షంగా పాక్ పై నిప్పులుచెరిగిన ప్రధాని మోడీ
By: Tupaki Desk | 5 May 2020 4:58 PM GMTప్రపంచంలోని అన్ని దేశాలు ఓ వైపు కరోనాపై పోరాడుతుండగా.. మరోవైపు కొంతమంది టెర్రరిజం, ఫేక్ న్యూస్, వక్రీకరించిన వీడియోలవంటి వాటితో ప్రమాదకరమైన వైరస్ లను వ్యాపింపజేస్తున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు. దేశాలను, మతాలను చీల్చేందుకు ఈ విధమైన యత్నాలకు పాల్పడుతున్నారని అన్నారు. పాకిస్తాన్ గురించి నేరుగా ప్రస్తావించకుండా ఆయన.. ఆ దేశంపై నిప్పులు చెరిగారు. అలీన దేశాల శిఖరాగ్ర సమావేశాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రసంగించారు.
ఉగ్రవాద నిర్మూలనపై అలీన దేశాలు దృష్టి పెట్టాలని ఆయన కోరారు. కరోనా మహమ్మారి ఇప్పటికే ప్రపంచ దేశాల్లో సుమారు రెండున్నర లక్షల మందిని పొట్టన బెట్టుకోగా.. దాదాపు 30 లక్షల మందికి పైగా ఈ వైరస్ కి గురయ్యారు. అటు-పాకిస్తాన్ లో ఉగ్రవాద కార్యకలాపాలు మళ్ళీ ఊపందుకుంటున్నాయి. జమ్మూ కాశ్మీర్ లోయలో కేవలం ఒక్క నెలలోనే డజనుకు పైగా జరిగిన ఎన్ కౌంటర్లలో 22 మంది భద్రతా దళాల జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 3 న అక్కడి హంద్వారా ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు సైనికాధికారులు సహా అయిదుగురు జవాన్లు మృతి చెందారు.
నిన్నటికి నిన్న ఇదే ప్రాంతంలో ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. ఒక టెర్రరిస్టు మరణించాడు. పైగా తమ దేశంలో జైళ్లలో ఉన్న సుమారు యాభై మంది ఉగ్రవాదులను కరోనా సాకు చూపి పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేసింది. వీరిలో లష్కరే తోయిబా అగ్రనేత కూడా ఉన్నాడు. గత వారం పాక్ సైన్యం పూంచ్ జిల్లాలోని కిర్ని, షాపూర్, మాన్ కోట్ సెక్టార్ల వద్ద కాల్పులకు దిగింది. పాక్ సూచనల మేరకే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతోందని ప్రభుత్వం వర్గాలు చెప్తున్నాయి.