Begin typing your search above and press return to search.
'ఈశాన్యం'పై మోడీ సూపర్ స్కెచ్..!
By: Tupaki Desk | 29 March 2019 10:36 AM GMTఇల్లు కట్టేటప్పుడు ఈశాన్యం బాగుండాలని చూసుకుంటాం. ఈశాన్యం ఎక్కువగా ఉంటే ఇంటికి మంచిదవుతుందని నమ్మకం. ఇప్పుడు ఇదే నమ్మకాన్ని మోడీ అలవర్చుకున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావాలంటే ఈశాన్యం రాష్ట్రాలను అక్కున చేర్చుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో పాగా వేసిన బీజేపీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ లోక్ సభ స్థానాలను గెలుచుకునేలా మోడీ సూపర్ స్కెచ్ వేస్తున్నారు. ఉత్తరాదిలో మోడీ హవా దగ్గడం.. దక్షిణాదిలో కమలం వికసించకపోవడంతో ప్రధాని ఈశాన్య రాష్ట్రాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో కొంచెం కష్టపడితే కనీసం 20 సీట్లు దక్కే అవకాశాలున్నాయని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా ఈశాన్య రాష్ట్రాల ఇన్ చార్జిగా ఉన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ను నియమించి పెద్ద ఎత్తున కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ కు పెద్దగా బలం లేని.. ప్రాంతీయ పార్టీల ప్రభాల్యం ఉన్న ఈ రాష్ట్రాలపై ఇప్పుడు మోడీ ఫోకస్ చేయడం విశేషం. ప్రస్తుతం బీజేపీ పెద్దలు ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. రాష్ట్రాల్లోని పార్టీ పరిస్థితులను, గెలుపోటముల గురించి తెలుసుకుంటున్నారు.
భారత్ లో ఎనిమిది రాష్ట్రాలు అసోం- అరుణాచల్ ప్రదేశ్- సిక్కిం- మేఘాలయ- త్రిపుర- మిజోరాం- మణిపూర్- నాగాలాండ్ లను ఈశాన్య రాష్ట్రాలుగా పిలుస్తారు. ఈ రాష్ట్రాలన్నింటిలో కలిపి మొత్తం 25 లోక్ సభ స్థానాలున్నాయి. వీటిలో అసోంలోనే 14 స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ ఏడు, కాంగ్రెస్ మూడు, ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ 3 స్థానాల్లో గెలుపొందింది. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. అరుణాచల్ ప్రదేశ్ లోని ఒక స్థానంలో బిజేపీ నేత కిరన్ రిజిజు గెలుపొంది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. మరోచోట హస్తం పాగా వేసింది. మణిపూర్ లోని రెండు స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. మేఘాలయలోని రెండు స్థానాల్లో ఒకచోట కాంగ్రెస్, మరోచోట నేషనల్ పీపుల్స్ పార్టీ దక్కించుకుంది. నాగాలాండ్ లోని ఏకైక స్థానాన్ని పీపుల్స్ ఫ్రంట్ కైవసం చేసుకుంది. సిక్కింలో డెమొక్రటిక్ ఫ్రంట్ గెలుచుకుంది.
అరుణాచల్ ప్రదేశ్, అసోం, త్రిపురలో బీజేపీ అధికారంలో ఉంది. మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్ లో ప్రాంతీయపార్టీలున్నాయి. అవి కమలంకే సపోర్టుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలోని 8 రాష్ట్రాల్లోని 25 లోక్ సభ స్థానాల్లోని 20 స్థానాల్లో గెలుపొందాలని బీజేపీ వ్యూహం రచిస్తోంది. అధికారంలో ఉన్న రాష్ట్రాలు మినహాయించి సిక్కిం లాంటి డెమొక్రటిక్ ఫ్రంట్ పాతుకుపోయిన రాష్ట్రాలపై బీజేపీ కన్నేసింది. ఆ ప్రాంతాల్లో మోడీ పర్యటించేందుకు ప్లాన్ వేస్తున్నాడు. ఇక్కడి స్థానాలు వచ్చే విధంగా స్కెచ్ వేస్తే వ్యతిరేకత ఉన్న స్థానాలు పోయినా పర్వాలేదన్నట్లు ఆలోచిస్తున్నారు.
అయితే జాతీయ పౌరసత్వ చట్టంపై చేసిన సవరణలతో అసోంలో బీజేపీకి వ్యతిరేకత ఉంది. ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వంగా ఉన్న కమలంకు సపోర్టుగా ఉన్న అసోం గణపరిషత్ కూటమి నుంచి వైదొలిగింది. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా నిరసనజ్వాలాలు పెరిగాయి. ఆ తరువాత బీజేపీ నాయకులు గణపరిషత్ నేత అతుల్ బోరాతో చర్చలు జరిపి ప్రభుత్వంలో కొనసాగేలా చర్చలు జరిపారు. అలాగే జూడో పీపుల్స్ ఫ్రంట్, త్రిపురలోని ఇండిజీనిస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపురలు కూడా అసంతృప్తి వ్యక్తం చేయడంతో బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాదవ్ పర్యటించి ఆ నాయకులను ఒప్పించగలిగారు.
ఒకప్పుడు కాంగ్రెస్ హవా నడిచిన ఈ ప్రాంతంలో ఇప్పుడు హస్తం పార్టీ చతికిలపడింది. అయితే బీజేపీపై వస్తున్న వ్యతిరేకత కాంగ్రెస్‌కు ఫలిస్తుందని అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్‌కు ఈ ప్రాంతంలో సరైన నాయకుడు లేనందను బలం చూకూరే అవకాశాలు తక్కువేనంటున్నారు. మరి బీజేపీ వేస్తున్న ప్లాన్ సక్సెస్ అవుతుందా.. లేదో చూడాలి.