Begin typing your search above and press return to search.
ప్రధాని బసకు 5 కోట్లు.. యాత్రలకు 37 కోట్లు
By: Tupaki Desk | 7 Sep 2015 6:25 AM GMTదేశంలో సవాలక్ష సమస్యలు వేధిస్తున్నాప్రధానమంత్రి నరేంద్రమోడీ విదేశీ యాత్రల పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారన్న విమర్శలు విపక్షాల నుంచి వ్యక్తమవుతున్నాయి. గత సంవత్సర కాలంలో మోడీ విదేశీయాత్రలు ఎక్కువగా చేస్తున్నారు. ఆయన విదేశీయానం ఖర్చెంతో తెలుసా? వింటే డంగై పోవాల్సిందే! మోడీ విలాసవంతమన జీవితానికే ప్రాధాన్యం ఇస్తారనేందుకు ఇదో మచ్చుతునక అని దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మన్ కీ బాత్ అంటూ ఆల్ ఇండియా రేడియో (ఎయిర్)లో చెప్పే మోడీ తన విదేశీపర్యటనలకు పెట్టిన ఖర్చు అక్షరాలా రూ.37.22 కోట్లు. ఇదీ ఓ సమాచార హక్కు ఉద్యమకారుడు చెబితేనే తెలిసింది.
ప్రధానిగా పాలనాపగ్గాలు అందుకున్నాక ఏడాది కాలంలో మొత్తం 20 దేశాల్లో పర్యటించారాయన. అత్యధిక వ్యయం ఆస్ట్రేలియా - యూఎస్ - జర్మనీ - ఫిజీ - చైనా దేశాల పర్యటనకు కాగా, ఒక్క భూటాన్ దేశ పర్యటన మాత్రమే ఇందుకు మినహాయింపు.ఇక్కడ మాత్రం రూ.41.33లక్షలు మాత్రమే వెచ్చించారు.హోటళ్లలో బస ఖర్చు రూ.5.60కోట్లు అని, అద్దె కార్లకు రూ.2.40కోట్లు అని సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగు చూసింది. ఇదీ ఈ దేశ ప్రధానిగా మోడీ సాధించిన ఘనత.
మోడీ విదేశీ పర్యటనల ఖర్చుపై కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. వివేకానంద సూక్తులు వల్లెవేసే ఆయన ప్రజాధనాన్ని దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారని వారు ధ్వజమెత్తుతున్నారు. అయితే ఈ విమర్శలను బీజేపీ మంత్రులు, నాయకులు మాత్రం తేలిగ్గా కొట్టి పాడేస్తున్నారు. దేశంలో పెద్ద రాష్ర్టాల ముఖ్యమంత్రుల విదేశీయాత్రలు, ప్రత్యేక విమానాల కోసమే ఇరవై ,పాతిక కోట్ల వ్యయం అవుతున్న తరుణంలో ప్రధాని విదేశీ యాత్ర ఖర్చును పెద్దగా పట్టించుకోనవసరం లేదని వారు అంటున్నారు. అంతెందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం తక్కువ తిన్నారా ఆయన చైనా పర్యటనకు 15 మంది సభ్యుల బృందంతో కలిసి ప్రత్యేక విమానంలో వెళ్లిన సంగతి తెలిసిందే. బీజేపీ నాయకులు చెపుతున్న దాని ప్రకారం సీఎంల టూర్లకే రూ.20 కోట్లు అవుతుంటే మోడీ ఖర్చు పెద్ద లెక్కలోనిదా అనుకోకతప్పదేమో.