Begin typing your search above and press return to search.

మోడీ విదేశీ పర్యటనలు.. లాభాలు!

By:  Tupaki Desk   |   26 May 2015 1:30 PM GMT
మోడీ విదేశీ పర్యటనలు.. లాభాలు!
X
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలు ఇటీవలి కాలంలో తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. వాస్తవానికి ఏడాదిలో కేవలం 45 రోజులు మాత్రమే ఆయన విదేశాల్లో పర్యటించినా.. ప్రతిపక్షాలు దానిపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే, బీజేపీ వర్గాలు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాయి. మోదీ విదేశీ పర్యటనలకు ఎంతో మేలు జరిగిందని వివరిస్తున్నాయి. ఆ వర్గాల కథనం ప్రకారం..

క్రూడాయిల్‌పై ఆన్‌ టైమ్‌ డెలివరీ చార్జీలు వేయవద్దని బీజేపీ ప్రభుత్వం సౌదీ అరేబియాను ఒప్పించగలిగింది. తద్వారా దేశానికి కొన్ని వేల కోట్ల రూపాయలు మిగిలాయి. ఈ విషయంలో కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్‌, ధర్మేంధ్ర ప్రధాన్‌ కీలక పాత్ర పోషించారు.

భూటాన్‌లో భారతదేశం నాలుగు అతి భారీ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ స్టేషన్లు, డ్యాములు నిర్మిస్తోంది. భవిష్యత్తులో ఇక్కడ ఉత్పత్తి చేసే విద్యుత్తులో సింహభాగం భారత్‌కే రానుంది.

నేపాల్‌లో భారతదేశం అతి పెద్ద డ్యామ్‌ను నిర్మించనుంది. ఇక్కడ హైడ్రో పవర్‌ స్టేషన్‌ను కూడా నిర్మించనుంది. ఇక్కడ ఉత్పత్తి చేసే విద్యుత్తులో 83 శాతాన్ని భారతదేశం ఉచితంగా పొందనుంది. వాస్తవానికి, ఈ ప్రాజెక్టును దక్కించుకోవాలని చైనా విపరీతంగా ప్రయత్నం చేసినా అది భారత్‌కే దక్కింది.

జపాన్‌తో భారతదేశానికి సంబంధాలు మెరుగుపడ్డాయి. తద్వారా భారత్‌లో 30 బిలియన్‌ డాలర్లు అంటే రెండు లక్షల కోట్ల రూపాయలను ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో పెట్టుబడులు పెట్టడానికి జపాన్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది.

వియత్నాంతో భారతదేశ సంబంధాలు మెరుగుపడ్డాయి. దాంతో ఓఎన్‌జీసీకి చమురును వెలికితీసే కాంట్రాక్టును ఇవ్వడానికి వియత్నాం అంగీకరించింది. వాస్తవానికి చైనాతో విదేశాంగ విధానాలు దెబ్బతింటాయని యూపీఏ ప్రభుత్వం ఈ కాంట్రాక్టు తీసుకోవడానికి వెనకడుగు వేస్తే.. మోదీ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుంది.

అమెరికా నిషేధం విధించినా ఇరాన్‌ నుంచి భారతదేశానికి చమురు దిగుమతులు మరింత పెరిగాయి. అంతేనా.. చమురు ఉత్పత్తులను భారతీయ రూపాయల్లో విక్రయించడానికి ఇరాన్‌ అంగీకరించింది. తద్వారా మన ఫారెక్స్‌ను రక్షించింది. భవిష్యత్తులో కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తానని హామీ ఇవ్వడం ద్వారా కరెన్సీ హెచ్చుతగ్గుల నుంచి భారత్‌కు రక్షణ లభించింది. అంతేనా.. ఇరాన్‌లో చాబహార్‌ పోర్టును నిర్మించుకోవడానికి భారత్‌కు అవకాశం దక్కింది. తద్వారా మన ఓడలకు అక్కడ చోటు దొరికింది.

గత మూడు దశాబ్దాల్లో ఆస్ట్రేలియాను సందర్శించిన మొట్టమొదటి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే. బగ్గు, యురేనియం ఉత్పత్తుల్లో ఆస్ట్రేలియా అతిపెద్ద సరఫరాదారు అయినా ఇప్పటి వరకు ఎవరూ అక్కడికి వెళ్లలేదు. కానీ, ఆస్ట్రేలియా వెళ్లిన నరేంద్ర మోదీ.. భారతదేశానికి యురేనియం విక్రయించేందుకు టోనీ అబోట్‌ను ఒప్పించగలిగారు. దాంతో దేశంలో విద్యుదుత్పత్తి గణనీయంగా మెరుగుపడనుంది.

చైనాతో వాణిజ్య లోటు రోజురోజుకు పెరుగుతోంది. దాంతో చైనాలో పర్యటించిన మోదీ.. చైనా సహకారం అవసరాన్ని వివరించారు. త్వరలోనే యాంటీ డంపింగ్‌ చట్టం రాబోతోంది. దాంతో భారతదేశంలో చైనా భారీగా పెట్టుబడులు పెట్టనుంది. ఇప్పటికే భారతదేశంలో చైనా 1,40,000 కోట్ల పెట్టుబడులను చైనా పెట్టింది.

తన బృందంలోకి అజిత్‌ దోవల్‌ను తీసుకోవడం మోదీ చేసిన అతి మంచి పనుల్లో ఒకటి. అందుకే ఇటీవలి కాలంలో పెంటగాన్‌, ఇజ్రాయెల్‌, జపాన్‌లతో భారత్‌ వివిధ ఒప్పందాలు కుదుర్చుకోగలిగింది. ఐకే గుజ్రాల్‌ ప్రధానిగా ఉన్నప్పుడు విదేశాలతో ఎదురు దాడి వద్దని నిలుపుచేశారు. కానీ, మోదీ హయాంలో భారతదేశం టెర్రర్‌ బోటును నిలుపుచేసింది. ''మరోసారి ముంబై తరహా దాడి జరిగితే పాకిస్థాన్‌ బలూచిస్థాన్‌ను కోల్పోకతప్పదు'' అని హెచ్చరించడం ద్వారా పాకిస్థాన్‌ను, ఐఎస్‌ఐని మోదీ ప్రభుత్వం అదుపులో ఉంచింది.

ఈశాన్య ప్రాంతాల్లో సరిహద్దురోడ్లను నిర్మించేందుకు భారత్‌ అంగీకరించింది. గతంలో యూపీఏ విధానాల కారణంగానే ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంకు ఈ విషయంలో మనకు నిధులు ఇవ్వడానికి నిరాకరించింది.

హోరాహోరీగా యుద్ధం జరుగుతున్న యెమన్‌ నుంచి 4500కు పైగా భారతీయులను సురక్షితంగా దేశానికి తీసుకు రావడంలో మోదీ సర్కార్‌ విజయవంతమైంది. భారతీయులతోపాటు దాదాపు 41 దేశాల విదేశీయులను కూడా సురక్షితంగా తీసుకొచ్చారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా భారత్‌ పేరు మార్మోగింది. దీని కోసం మోదీ ప్రత్యేకంగా సౌదీ అరేబియా రాజుతో మాట్లాడారు. కొన్ని గంటలపాటు యుద్ధం నిలిపివేయాలని కోరారు. సుష్మా స్వరాజ్‌, దోవల్‌, జనరల్‌ వీకే సింగ్‌ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. మరొక ముఖ్య విశేషం ఏమిటంటే, ఈ ఆపరేషన్‌లో రక్షించిన వారిలో 95 శాతం ముస్లిములే. ఈ ఆపరేషన్‌ మోదీకి అంతర్జాతీయంగా అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చింది.

భారత వైమానిక దళం, అందులోని రక్షణ వ్యవస్థలు రోజురోజుకు బలహీనం అవుతున్నాయి. యూపీఏ ప్రభుత్వం వైమానిక దళాన్ని గాలికి వదిలేసింది. కానీ, మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే మోదీ రఫేల్‌తో చర్చలు జరిపారు. 36 జెట్స్‌ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇవి అతి త్వరలో భారత్‌కు రానున్నాయి. విశేషం ఏమిటంటే, ఇంత హడావుడిగా ఒప్పందం కుదుర్చుకున్నా చిన్న అవినీతి ఆరోపణ కూడా రాకపోవడం.

నాలుగు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని ఒకరు కెనడా వెళ్లారు. అక్కడి ప్రభుత్వంతో వివిధ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. భారత్‌కు యురేనియం విక్రయించేలా కెనడాను ఒప్పించారు. రాబోయే ఐదేళ్లపాటు యురేనియం సరఫరా కానుంది. అంతేనా, భారతీయులకు వీసా ఆన్‌ అరైవల్‌ ఇచ్చేందుకు కెనడా అంగీకరించింది.

అణు రియాక్టర్లు కావాలంటే మనం రష్యానో అమెరికానో అడుక్కోవాల్సి వచ్చింది. కానీ, ఫ్రాన్స్‌ అత్యాధునిక అణు రియాక్టర్లు ఇచ్చేలా మోదీ చర్చలు జరిపారు. వాటిని కూడా భారతదేశంలోనే తయారుచేసేలా మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా ఒప్పందం కుదుర్చుకున్నారు.

అమెరికాతోనూ ఇటువంటి ఎన్నోవిలువైన ఒప్పందాలను మోదీ కుదుర్చుకున్నారు.