Begin typing your search above and press return to search.

మోడీకి అనుకోని ఇమేజ్..అమాంతం పెరిగింది..!

By:  Tupaki Desk   |   27 Feb 2019 6:11 AM GMT
మోడీకి అనుకోని ఇమేజ్..అమాంతం పెరిగింది..!
X
త్వరలో దేశవ్యాప్తంగా లోక్‌ సభ ఎన్నికలు జరగుతున్న నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందోనన్న చర్చ తీవ్రంగా జరుగుతోంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌.. దానికి మద్దతిస్తున్న పార్టీలు మొన్నటి వరకు అధికారంలోకి రావడం ఖాయమని ధీమాగా ఉన్నాయి. కానీ ఇటీవల జరిగిన పుల్వామా దాడి.. దానిపై మోడీ సర్జికల్ స్ట్రైక్స్ తో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మోడీ ఇమేజ్‌ పూర్తిగా పైకెక్కిందనే వాదన సాగుతోంది. ఇందుకు సోషల్‌ మీడియా వేదికైంది.

పూల్వామాలో జవాన్లపై జరిగిన ఉగ్రదాడితో ప్రతీకారం తీర్చుకుంటానని మోడీ సవాల్‌ విసిరారు. దీంతో మోడీ మాటల వరకే గానీ చేతల్లో చూపించలేడని అంతా అనుకున్నారు. కానీ మంగళవారం ఉదయం సెర్జికల్‌ స్ట్రైక్‌ తో మోడీపై ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అభిమానం విపరీతంగా పెరిగింది. పాకిస్థాన్‌ లోని ఉగ్ర శిబిరాలపై విమాన దాడులు చేసి 300 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో మోదీ అనుకున్నది చేయగలడని సోషల్‌ మీడియాలో మోడీకి అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు.

ఈ ప్రభావం ఎన్నికలపై కచ్చితంగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఐదేళ్లలో మోడీపై వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవమే అయినా - ఉగ్రవాదులపై సమరభేరి సాగిస్తుండడంతో మరోసారి మోదీ దేశ ప్రధాని కాగలడన్నది పొలిటికల్‌ సర్వేల అంచనా. సెర్జికల్‌ స్ట్రైక్‌ పూర్తయిన రోజు మోదీ ఓ బహిరంగ సభలో పాల్గొని 'దేశ భద్రత కోసం ఎలాంటి త్యాగానికైనా వెనుకాడం. దేశం ప్రస్తుతం సేఫ్ జోన్‌ లో ఉంది' అని చెప్పడం పై హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ మాటలకు బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు.

సెర్జికల్‌ స్ట్రైక్‌ పై ప్రతిపక్షాలు కూడా ఎలాంటి కామెంట్‌ చేయడానికి సాహసించలేకపోయాయి. వ్యతిరేకంగా మాట్లాడిదే దెబ్బైపోవడం ఖాయం కావడంతో ప్రశంసలే కురిపించాయి. కానీ ఈ క్రెడిట్ మొత్తం మోడీ తన ఖాతాలో వేసుకుంటున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ తో మోడికి ఇక తిరుగులేదా..? అనే ప్రచారం ప్రస్తుతం సాగుతోంది.

మార్చి1 న మోడీ ఏపీకి వస్తున్నారు. ఇన్నాల్లు మోడీని తిట్టిన బాబు ఇప్పుడు ఏం అనడానికి లేకుండా పోతోంది. మోడీ కి వస్తున్న ఈమేజ్ ముందు బాబు మౌనం దాల్చాడు. ఇప్పుడు ఏపీలో మోడీ ఏం మాట్లాడుతారనే ఉత్కంఠ నెలకొంది.