Begin typing your search above and press return to search.

బడ్జెట్: ఏపీ - తెలంగాణకు షాకిచ్చిన మోడీ

By:  Tupaki Desk   |   2 Feb 2020 6:57 AM GMT
బడ్జెట్: ఏపీ - తెలంగాణకు షాకిచ్చిన మోడీ
X
కేంద్ర బడ్జెట్ తెలుగు రాష్ట్రాలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. పన్నుల వాటాల్లో రాష్ట్రాలకు వచ్చే నిధుల్లో కేంద్రం ఒక చాతం కోత విధించడంతో తెలంగాణ, ఏపీకి భారీ నష్టం వాటిల్లుతోంది.

2020-21 సంవత్సరానికి రాష్ట్రాలకు ఇచ్చే కేంద్ర నిధులను 42శాతం నుంచి 41శాతానికి తగ్గించాలని 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు కేంద్రం ఈ కోత విధించింది. కొత్తగా ఏర్పడ్డ జమ్మూకశ్మీర్, లఢక్ కేంద్ర ప్రాంత ప్రాంతాల భద్రత, ప్రత్యేక అవసరాల కోసం కేంద్ర ఈ 1శాతం అన్ని రాష్ట్రాలకు నిధులను తగ్గించినట్లు బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రకటించారు. స్థానిక సంస్థలకు ఈసారి 90వేల కోట్లు కేటాయిస్తున్నట్టు నిర్మలా తెలిపారు.

ఆర్థిక మందగమనం దృష్ట్యా రాష్ట్రాలకు కేంద్రం నిధులు పెంచుతుందని భావిస్తే 1శాతం తగ్గించడంపై రాష్ట్రాలు మండిపడుతున్నాయి. జమ్మూకశ్మీర్ - లఢక్ ఖర్చును మోడీ సర్కారు భరించకుండా రాష్ట్రాలకు నిధులు కట్ చేసి వారి నెత్తిన మోపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కేంద్రం తగ్గించిన పన్నుల వాటా 41శాతం ప్రకారం ఏపీకి 32వేల 237 కోట్లు - తెలంగాణకు 16726 కోట్లు లభిస్తాయి. 42శాతం చొప్పున ఇస్తే మరిన్ని నిధులు వచ్చేవి.