Begin typing your search above and press return to search.

దేశంలో మళ్లీ లాక్ డౌన్.. క్లారిటీ ఇచ్చిన ప్రధాని

By:  Tupaki Desk   |   17 Jun 2020 2:16 PM GMT
దేశంలో మళ్లీ లాక్ డౌన్.. క్లారిటీ ఇచ్చిన ప్రధాని
X
భారతదేశంలో కరోనా కేసులు జెట్ స్పీడులా పెరుగుతున్నాయి. కరోనా కేసుల్లో ప్రపంచంలోనే 4వ స్థానానికి భారత్ చేరుకుంది. దీంతో దేశమంతా భయాందోళనలు నెలకొన్నాయి.ఈ క్రమంలోనే ఈనెల 20 నుంచి లాక్ డౌన్ దేశంలో విధిస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో బాగా జరుగుతోంది. కేంద్రం మరోసారి పూర్తి స్తాయి లాక్ డౌన్ విధిస్తుందంటూ ప్రచారం జరుగుతోంది.

తాజాగా సీఎంలతో భేటి అయిన ప్రధాని నరేంద్రమోడీని ఇదే విషయంపై తెలంగాణ సీఎం కేసీఆర్ అడిగేశారు. కేసీఆర్ విజ్ఞప్తిపై ప్రధాని నరేంద్రమోడీ క్లారిటీ ఇచ్చారు. దేశంలో లాక్ డౌన్ ల దశ ముగిసిందని.. అన్ లాక్ ల దశ ప్రారంభమైందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

దేశంలో ఇక మళ్లీ లాక్ డౌన్ ఉండదని ప్రధాని మోడీ కుండబద్దలు కొట్టారు. ఇప్పటికే నాలుగుదశల లాక్ డౌన్ ముగిసిందని.. ప్రస్తుతం అన్ లాక్ 1.0 నడుస్తోందని తెలిపారు. అన్ లాక్ 2.0 ఎలా అమలు చేయాలనే విషయంపైనే తాము చర్చిస్తామని మోడీ తాజాగా కేసీఆర్ కు వివరణ ఇచ్చారు.

ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం కృషి చేస్తోందని.. హైదరాబాద్ దాని చుట్టుపక్కల జిల్లాల్లో మాత్రమే కరోనా కేసులు నమోదవుతున్నాయని.. తెలంగాణలో అదుపులోనే ఉందని ప్రధాని మోడీకి వివరించారు. కరోనాపై విజయం సాధిస్తామనే విశ్వాసం ఉందన్నారు. మళ్లీ మామూలు జీవితం ప్రారంభమవుతుందని అనిపిస్తోందని కేసీఆర్ అన్నారు.