Begin typing your search above and press return to search.
కోపం నాపై చూపండి.. హెచ్చరించిన మోడీ..
By: Tupaki Desk | 22 Dec 2019 10:57 AM GMTప్రధాని మోడీలో ఆగ్రహం పెల్లుబుకింది. ఇన్నాళ్లుగా అణిచిపెట్టుకుంది అంతా కక్కేశాడు. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో మోడీ ధన్యవాద సభ జరిగింది. ఇందులో పాల్గొన్న మోడీ ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతూ దేశంలో పౌరసత్వ మంటలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
పౌరసత్వ చట్టం వల్ల ఢిల్లీలో అనధికారికంగా ఉంటున్న కాలనీల మతాలను చూడకుండానే రెగ్యులరైజ్ చేశామని.. కనీసం మెదడు ఉంటే చట్టం గురించి తెలుసుకొని మాట్లాడండి అంటూ విమర్శిస్తున్న వారిపై ప్రధాని మోడీ నోరుపారేసుకున్నారు. అబద్దాలు ప్రచారం చేసే వాళ్లను నమ్మకండి అని ప్రజలకు సూచించారు. ప్రజల మధ్య వారు విద్వేశాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
పౌరసత్వ బిల్లును తీసుకొచ్చినందుకు పార్లమెంట్ కు ధన్యవాదాలు తెలుపాలని మోడీ అన్నారు. ఢిల్లీలో ప్రజలకు కనీస హామీలు ఆప్ సర్కారు అమలు చేయలేదని ఆరోపించారు. తాగేందుకు నీరు ఇవ్వలేదని.. ఢిల్లీ ప్రజల తాగునీటి గోస ఆప్ సర్కారుకు పట్టదని విమర్శించారు.
జాతి, మతాలను చూడకుండా పేదరికాన్ని మాత్రమే చూసి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మోడీ అన్నారు.మీకు కోపం ఉంటే మోడీపై చూపించాలని.. మోడీని తిట్టండని.. మోడీకి వ్యతిరేకంగా ర్యాలీలు తీయాలని.. పేదలను ఇబ్బంది పెట్టవద్దని మోడీ హెచ్చరికలు జారీ చేశారు.