Begin typing your search above and press return to search.

బిహార్ లో పదవి పీకేసి..కేంద్రానికి తీసుకెళుతున్న మోడీషాలు

By:  Tupaki Desk   |   16 Nov 2020 4:00 AM GMT
బిహార్ లో పదవి పీకేసి..కేంద్రానికి తీసుకెళుతున్న మోడీషాలు
X
బిహార్ ఎన్నికల్లో బీజేపీకి పెద్ద ఎత్తున సీట్లు రావటానికి.. ఈ రోజున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో కీలకభూమిక పోషించారు బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ. నితీశ్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయన.. తాజాగా ముగిసిన ఎన్నికల తర్వాత.. ఆయన తన బలమేమిటో చెప్పకనే చెప్పేశారు. ఇలాంటి వేళ.. సునీల్ కుమార్ కష్టానికి తగిన గుర్తింపు ఉండదా? అన్న ప్రశ్నలు వినిపించాయి.

ఎన్డీయే కూటమిలోభాగస్వామ్య పక్షమైన జేడీయూ.. బీజేపీకి కంటే తక్కువ సీట్లను సొంతం చేసుకుంది. ఇలాంటివేళ.. బీజేపీ నేత ముఖ్యమంత్రి అవుతారేమోనన్న వాదనలు వినిపించాయి. అయితే.. బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ ఉంటారని తేల్చేసిన మోడీ.. అనవసరమైన కన్ఫ్యూజన్ కు చెక్ చెప్పేశారు. నితీశ్ కు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్న సుశీల్ కుమార్ ను ఢిల్లీకి తీసుకెళ్లిపోయేలా నిర్ణయాన్ని తీసుకున్నారు.

దీంతో.. బిహార్ రాష్ట్ర పగ్గాలు చేపట్టే నితీశ్ కు ఇబ్బంది కలగకుండా మోడీషాలు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు. బిహార్ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సుశీల్ ను ప్రమోషన్ పేరుతో కేంద్రానికి తీసుకెళుతున్నారు. ఆయనకు కేంద్రమంత్రివర్గంలో చోటుకల్పించలని డిసైడ్ అయ్యారు. సుశీల్ ప్లేస్ లో ఉప ముఖ్యమంత్రి పదవిని తార్ కిషోర్ కు అప్పజెప్పాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. మొత్తానికి బిహార్ ఎన్నికల్లో బీజేపీ తరఫున చక్రం తిప్పిన సుశీల్ కు రాష్ట్రంలో పదవి ఇవ్వకుండా.. కేంద్రానికి తీసుకెళుతున్న వైనం ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.