Begin typing your search above and press return to search.

150 కిలోమీటర్లు నడవండి.. ఎంపీలకు మోడీ షాక్!

By:  Tupaki Desk   |   9 July 2019 5:31 PM IST
150 కిలోమీటర్లు నడవండి.. ఎంపీలకు మోడీ షాక్!
X
భారతీయ జనతా పార్టీ ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఒక రకమైన షాక్ నే ఇచ్చాడని తెలుస్తోంది. బీజేపీ ఎంపీలు ఒక్కోరు తమ తమ నియోజకవర్గాల పరిధిలో పాదయాత్రలు చేయాలని మోడీ సూచించారు. అందుకు గానూ బీజేపీ లోక్ సభ, రాజ్యసభ సభ్యులకు మోడీ టార్గెట్ కూడా పెట్టారు. ఒక్కో ఎంపీ కనీసం 150 కిలోమీటర్ల పాదయాత్రను చేసి ప్రజలతో మమేకం కావాలని మోడీ సూచించడం గమనార్హం!

మహాత్మగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని బీజేపీ ఎంపీలంతా 150 కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించాలని మోడీ సూచించారు. వల్లభాయ్ పటేల్ జయంతి వరకూ ఆ పాదయాత్రను సాగించాలని.. 150 కిలోమీటర్ల పాదయాత్రను చేయాలని మోడీ సూచించినట్టుగా సమాచారం.

ఆ పాదయాత్ర సాగినంత దూరం.. ప్రజలతో మాట్లాడుత, వారికి వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ, చెట్లను నాటుతూ సాగాలని మోడీ సూచించారు. లోక్ సభ నియోజకవర్గాల్లో ఇటీవలే నెగ్గి వచ్చిన ఎంపీలు ఇలా ప్రజలకు చేరువ కావాలని ఆయన పేర్కొన్నారు.

రాజ్యసభ సభ్యులకు ప్రత్యేకంగా నియోజకవర్గాలు ఉండవు కదా.. అంటే, పార్టీ ఓడిపోయిన నియోజకవర్గాలను వారు లక్ష్యంగా చేసుకోవాలని..అలాంటి నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయాలని మోడీ సూచించినట్టుగా తెలుస్తోంది!