Begin typing your search above and press return to search.

మోడీ తాజా ప‌థ‌కం.. చౌక ఏసీలు!

By:  Tupaki Desk   |   29 May 2019 11:38 AM GMT
మోడీ తాజా ప‌థ‌కం.. చౌక ఏసీలు!
X
ఎండ‌లు మండిపోతున్నాయి. రోడ్డు మీదకు వ‌స్తే ఎండ ఎలా మండుతుందో.. ఇంట్లో కూర్చుంటే నిప్పుల మంట‌లాంటి ప‌రిస్థితి. అక్క‌డా ఇక్కడా అన్న తేడా లేకుండా.. దేశ వ్యాప్తంగా ఎండ‌లు మండిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలో మోడీ స‌ర్కారు స‌రికొత్త ప‌థ‌కాన్ని తెర మీద‌కు తెచ్చింది.

ఎండ తీవ్ర‌త‌తో ఇబ్బంది ప‌డుతున్న ప్ర‌జ‌ల‌కు ఇబ్బందుల నుంచి బ‌య‌ట‌ప‌డేసేందుకు వీలుగా.. మోడీ స‌ర్కారు స‌రికొత్త ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టింది. ప్ర‌స్తుతం మార్కెట్లో ల‌భిస్తున్న ఏసీల ధ‌ర‌ల‌తో పోలిస్తే.. 10 నుంచి 20 వాతం ధ‌ర‌కు త‌క్కువ‌గా ఉండేలా ఏసీల్ని ఇచ్చేలా ప్లాన్ చేసింది.

ఈ ఏసీల‌ను ఈసీఐల్ ఆవిష్క‌రిస్తోంది. చౌక‌ధ‌ర‌ల‌కు.. అంద‌రికి అందుబాటులో ఉండే ధ‌ర‌ల్లో ల‌భ్య‌మ‌య్యేలా ఉండే ఈ ఏసీకి సంబంధించి మ‌రో కీల‌క‌మైన ఫీచ‌ర్ ఏమంటే.. విద్యుత్ ఖ‌ర్చు చాలా త‌క్కువ‌గా ఉండేలా వీటిని రూపొందిస్తున్నారు. అంతేకాదు.. ఈ ఏసీల‌ను బ‌జార్ల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌ని.. ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేయొచ్చ‌ని చెబుతున్నారు.

వీటితో పాటు.. ఈ ఏసీల‌కు ఎక్సైంజ్ ఆఫ‌ర్ కూడా ఉంద‌ని చెబుతున్నారు. చౌక ధ‌ర‌తో.. సామాన్యులు సైతం ఏసీలు కొనుగోలు చేసేందుకు వీలుగా వీటిని రూపొందిస్తున్నారు. మ‌రో నెల‌.. రెండు నెల‌ల లోపు ఈ ఏసీలు మార్కెట్లోకి రానున్నాయి. గ‌తంలో త‌క్కువ ధ‌ర‌ల‌కు ఎల్ ఈడీ బ‌ల్బులు.. ట్యూబ్ లైట్ల‌ను అందించిన ఘ‌న‌త ఈసీఐఎల్ సొంతంగా చెప్పాలి. మంచి నిర్ణ‌య‌మే కానీ.. ఎండ‌లు స్టార్ట్ కానున్న వేళ‌లో ఈ ప‌థ‌కాన్ని ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తెచ్చి ఉంటే మ‌రింత బాగుండేది.