Begin typing your search above and press return to search.
హోదాకి సమాధి కట్టేసేలా మోడీ నిర్ణయం
By: Tupaki Desk | 15 March 2017 4:15 PM GMTఏపీ ప్రయోజనాలకు కీలకమైన ప్రత్యేక హోదాకు సమాధి కట్టేసేలా నిర్ణయం తీసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆ మధ్య అర్థరాత్రి వేళ..హడావుడిగా..ఆగమాగం చేసి మరీ ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి తాజాగా చట్టబద్ధత కల్పించే కేంద్రమంత్రిమండలిలో ఆమోదాన్ని తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక హోదా హామీని గాలికి వదిలేసి.. ప్యాకేజీతో ఏపీ ప్రజలకు పంగనామాలు పెట్టేసేందుకు మోడీ రంగం సిద్ధం చేయగా..అందుకు తన శక్తివంచన లేకుండా ఎంతగా దెబ్బేయాలో అంతగా దెబ్బేసిన చంద్రబాబు.. తనను నమ్మిన ఏపీ ప్రజలకు మర్చిపోలేని బహుమానాన్నిఇచ్చారని చెప్పాలి.
తాజాగా కేంద్రం ఆమోదం పొందిన ప్రత్యేక ప్యాకేజీ కారణంగా.. ప్రత్యేక హోదా అన్నది ఇక గతంగా మారిపోయినట్లే.వాస్తవానికి హోదా విషయాన్ని తాము ఎప్పుడో వదిలేసిన వైనాన్ని ఏపీ బడ్జెట్ లో ప్రస్తావించినబాబు సర్కారు తగ్గట్లే.. ఈ రోజు సాయంత్రం (బుధవారం) జరిగిన కేంద్రమంత్రిమండలి సమావేశంలో ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి ఆమోదం పలుకుతూ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం ఆమోదం పొందిన ప్యాకేజీ కారణంగా ఏపీకి కొన్నిప్రయోజనాలు చేకూరనున్నాయి. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టుకు వందశాతం నిధులు ఇచ్చే అంశంపైనా కేంద్రం సముఖత వ్యక్తం చేసింది.
హోదా వల్ల కేంద్రంనుంచి90 శాతం నిధులురావాల్సిన స్థానే.. తాజాగా ఓకే చేసిన ప్రత్యేక ప్యాకేజీకారణంగా 60 శాతం నిధులు మాత్రమే రానున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే.. హోదాను వదిలేసి..ప్యాకేజీకి ఓకే చెప్పటం వల్ల ఏపీకి ఎంత నష్టం జరగాలో అంత నష్టం వాటిల్లినట్లేనని చెప్పక తప్పదు.