Begin typing your search above and press return to search.
ఏపీకి హోదా లేదు.. మోడీ మళ్లీ మళ్లీ..!
By: Tupaki Desk | 19 July 2022 1:30 PM GMTరాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు మరోసారి పాత మాటే చెప్పింది. హోదా ముగిసిన అధ్యాయమని లోక్‌సభకు తెలిపింది. విభజన చట్టం హామీలను చాలావరకు నెరవేర్చామన్న హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్..హామీల్లో కొన్ని మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ మేరకు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ జవాబిచ్చారు.
ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా 42 శాతా నికి పెంచిందని వెల్లడించారు. అలాగే రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాలకు అదనపు నిధులు కేటాయించింద ని చెప్పారు. 15వ ఆర్థిక సంఘం కూడా ఆ సిఫారసులను కొనసాగించిందని వివరించారు.
విభజన చట్టం ప్రకారం ఇచ్చిన ఇతర హామీలను చాలావరకు నెరవేర్చామన్న నిత్యానందరాయ్.. కొన్ని మాత్రమే ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వివాదాల పరిష్కారానికి 28 సమావేశాలు ఏర్పాటు చేశామని చెప్పారు. అయితే.. తాజాగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీ అధికార పార్టీ వైసీపీ కేంద్రానికి బేషరతుగా మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం ఏమన్నా.. రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుం దని.. ఏపీకి వరాలు ఏమైనా ఇస్తుందని ప్రజలు భావించారు. అయితే.. ఇప్పటి వరకు కూడా కేంద్రం అలాంటి నిర్ణయం దిశగా ఎక్కడా సర్కారు నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.
అదేసమయంలో తాము హోదా ఇచ్చేది లేదని.. స్పష్టం చేయడంతో ఏపీ ప్రజలు ఆశలు నీరిగారినట్టేన ని.. వైసీపీ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం.. పనిచేస్తోందే తప్ప.. ప్రజల కోసం కాదని.. స్పష్టంగా తెలు స్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వాస్తవానికి కేంద్రానికి మనతో అవసరం వచ్చినప్పుడు.. హోదా సహా.. ఇతర హామీలపై.. పట్టుబట్టి సాధించుకుందామని..జగన్ చెప్పడం గమనార్హం. అయితే.. ఇప్పుడు ఎలాంటి షరతులు లేకుండానే.. రాష్ట్రపతి ఎన్నికల్లో మోడీకి అనుకూలంగా ఓటేయడం గమనార్హం.